ఈ జ్యూసులతో పీరియడ్స్ పైన్స్ కి బై బై.. 

TV9 Telugu

26 July 2024

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే పోషకాల కారణంగా పీరియడ్స్ లో వచ్చే కడుపులో తిప్పడం, నొప్పి, తిమ్మిర్లు వంటి వాటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.

ఈ జ్యూస్ పెయిన్ కిల్లర్ కు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఇ పోషకాలు ఉంటాయి.

పీరియడ్స్ టైమ్ లో యాపిల్ జ్యూస్ కూడా బాగా పని చేస్తుంది. ఈ  జ్యూస్ కడుపు నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

యాపిల్ జ్యూస్ లోని పోషకాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని 70 శాతం వరకూ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పీరియడ్స్ సమయంలో వచ్చే అసౌకర్యం, కడుపు నొప్పి వంటి వాటిని బొప్పాయి రసం తాగడం ద్వారా దూరం చేసుకోవచ్చు.

బొప్పాయిలో మినరల్స్, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఈ జ్యూస్ న్యాచురల్ గానే నొప్పి నివారిణిగా పని చేస్తుంది.

నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందుల నుంచి పైనాపిల్ జ్యూస్ ఉపశమనం ఇస్తుంది. ఈ జ్యూస్ లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

గర్భాశయ లైనింగ్ సంకోచాల కారణంగా పిరియడ్స్ నొప్పి వస్తుంది. ఆ సమయంలో పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల గర్భాశయం రిలాక్స్ అవుతుంది. దీంతో నొప్పి తగ్గుతుంది.