24 July 2024
TV9 Telugu
Pic credit - GETTY
ఉసిరికాయలో విటమిన్ సీ, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి లక్షణాలు ఉన్నాయి.
ఉసిరి చర్మానికి, జుట్టుకు, రోగనిరోధక శక్తికి, మధుమేహానికి మంచిది. అంతేకాదు ఇది కడుపు సమస్యలను తొలగించడంలో మంచి సహాయకారి. అయితే ఇది చాలా నష్టాలను కూడా కలిగిస్తుంది.
ఉసిరిని ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు ఖాళీ కడుపుతో తీసుకుంటే.. అది పొట్ట గోడకు చికాకు కలిగిస్తుంది. ఎసిడిటీని తీవ్రతరం చేస్తుంది.
ఎవరైనా ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే.. వెంటంటే బాధితులు ఉసిరిని తినకూడదు. దీని వినియోగం రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎవరైనా రక్త సంబధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి తినకూడదు. దీనీలోని యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాలు రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కనుక ఉసిరి తీసుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది.
ఉసిరి రక్తంలో షుగర్ లెవెల్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. ఉసిరికాయ అధికంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి వేగంగా పడిపోతుంది.
ఉసిరిలో అనేక పోషక విలువలు ఉన్నప్పటికీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలకు దారితీయవచ్చు
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు ఇచ్చే స్త్రీలు ఉసిరి తినడం హానికరం. ఈ విషయంపై సరైన సమాచారం లేకపోయినా ఉసిరిని తినేముందే వైద్యుల సలహా తీసుకోవాలి.