లండన్: అంపైర్ల తప్పులకు ఒక దేశం మొత్తం మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ముగిసిన వరల్డ్ కప్‌లో కూడా ఎంపైర్ల మిస్టేక్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వచ్చాయి. దీంతో ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టి సారించింది. ఇప్పటి నుంచి నోబాల్‌ను పర్యవేక్షించే బాధ్యత థర్డ్ అంపైర్‌కు కూడా అప్పగించనుంది. దీంతో ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను గుర్తించడంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్లు కూడా బాధ్యత నిర్వహించనున్నారు. అంతకుముందు రివ్యూ కోరినప్పుడు మాత్రమే థర్డ్ అంపైర్ నోబాల్‌ను పరిశీలించేవారు. బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ నిబంధనను ఐసీసీ అమలుచేయనుంది. దీన్ని ముందుగా భారత్‌లో జరిగే దేశవాళీ క్రికెట్‌లో పరీక్షించనున్నారు. ఇది విజయవంతమైన తర్వాత అంతర్జాతీయ మ్యాచుల్లో ప్రవేశపెడతారు.