PV Sindhu: ఒక్క అడుగు! ప్రతిష్ఠాత్మక మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు.. తుది‌ పోరు ఎప్పుడంటే?

ప్రతిష్ఠాత్మక మలేషియా మాస్టర్స్ 500 టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జోరు కొనసాగుతోంది. తాజాగా సెమీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుందీ హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్వీన్. శనివారం (మే 25న)న జరిగిన ఈ మ్యాచ్ సుమారు 88 నిమిషాల..

PV Sindhu: ఒక్క అడుగు! ప్రతిష్ఠాత్మక మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు.. తుది‌ పోరు ఎప్పుడంటే?
PV Sindhu
Follow us

|

Updated on: May 25, 2024 | 7:03 PM

ప్రతిష్ఠాత్మక మలేషియా మాస్టర్స్ 500 టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జోరు కొనసాగుతోంది. తాజాగా సెమీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుందీ హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్వీన్. శనివారం (మే 25న)న జరిగిన ఈ మ్యాచ్ సుమారు 88 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో సింధు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసిన తెలుగు తేజం తర్వాతి రెండు సెట్లను ఏకపక్షంగా గెలిచింది. తద్వారా ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించగలిగింది. ఇదిలా ఉంటే గత ఏడాది కాలంలో ఓ మేజర్ టోర్నీలో సింధు ఫైనల్ ఆడడం ఇదే తొలిసారి. ఈ టోర్నీకి ముందు జరిగిన చాలా టోర్నీల్లో సింధు నాకౌట్ కు చేరకుండానే చతికిలపడిపోయింది. అయితే మలేషియా మాస్టర్స్ 500 టోర్నీ కోసం బాగా సన్నద్ధమైన సింధు ఇప్పుడు ఫైనల్స్‌కు చేరుకుని సత్తా చాటింది.

కాగా ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో గెలిచేందుకు సింధు బాగా చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి సెట్‌లో బుసానన్‌ చేతిలో 13-21 తేడాతో సింధు ఓడిపోవాల్సి వచ్చింది. అయితే రెండో సెట్ ఆరంభంలోనే సింధు తన వ్యూహాన్ని మార్చుకుని దూకుడును అవలంభించింది. ఫలితంగా సింధు 21-16తో రెండో సెట్‌ను కైవసం చేసుకుని సమం చేసింది. మూడో సెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన మన బ్యాడ్మింటన్ స్టార్ 21-12తో మూడో సెట్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. BWF వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్‌లో సింధు కెరీర్‌లో ఇది నాలుగో ఫైనల్. ఆదివారం (మే 26) తుదిపోరు జరగనుంది.

ఇవి కూడా చదవండి

ఇక సింధు ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యితో తలపడాల్సి ఉంది. 15వ సీడ్ పివి సింధుకు, రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఈ విజయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు జర్మనీలో సన్నద్ధం కావడానికి సింధుకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్