ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన పెట్రా క్విటోవా

పెట్రా క్విటోవా 2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. గత ఎనిమిదేండ్లలో క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. 6-2, 6-4 తేడాతో చైనా టెన్నీస్‌ క్రీడాకారిణి ఝాంగ్‌ షుయ్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఏడవ సీడ్ చెక్ క్రీడాకారిణి 2012 లో రోలాండ్ గారోస్‌లో..

ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన పెట్రా క్విటోవా

Updated on: Oct 05, 2020 | 7:04 PM

Petra Kvitova returned  : సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు..చాలా గ్యాప్.. ఓ మెరుపు మెరిసింది..రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్‌.. 30 ఏండ్ల వయసున్న పెట్రా క్విటోవా.. ఈ అందాల సుందరి ఆడుతుంటే.. స్టేడియం మొత్తం సందడిగా మారిపోయింది. కొవిడ్ ఆంక్షలను సైతం మరిచిపోయారు. అందరి అంచనాలకు మించిన ఆటతీరును ప్రదర్శించింది పెట్రా ఫ్యాన్స్.

పెట్రా క్విటోవా 2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. గత ఎనిమిదేండ్లలో క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. 6-2, 6-4 తేడాతో చైనా టెన్నీస్‌ క్రీడాకారిణి ఝాంగ్‌ షుయ్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఏడవ సీడ్ చెక్ క్రీడాకారిణి 2012 లో రోలాండ్ గారోస్‌లో జరిగిన తన ఏకైక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. మొదటి సెట్‌లో 5-2తో వెనుకబడి ఉండగా ఝాంగ్‌ షుయ్‌కు వైద్య సహాయం కోసం మ్యాచ్‌ను నిలుపాల్సి వచ్చింది.

పెట్రా క్విటోవా  నెక్స్ట్ మ్యాచులో లారా సీజ్‌మండ్‌తో తలపడనున్నది. అన్‌సీడెడ్ జర్మన్ క్రీడాకారిణి లారా సీజ్‌మండ్‌ 7-5, 6-2తో పౌలా బడోసాను ఓడించి తొలిసారిగా ప్రధాన టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నది.