Ghana vs Gabon AFCON Match: ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలు కొత్తమీకాదు. ఇది తరచుగా కనిపిస్తుంది. అయితే గాయాలయ్యేలా తన్నుకోవడం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టోర్నమెంట్‌లో జరిగిన ఓ ఫైటింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పోరును అదుపు చేయలేనంత తీవ్రంగా మారింది. ఈ గొడవను ఆపడానికి భద్రతా సిబ్బంది చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. అలాగే, సంఘటన జరిగిన వెంటనే, నిందితులైన ఆటగాళ్లపై కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో ఘనా, గాబన్ జట్ల మధ్య పోరు జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఆటగాళ్ల మధ్య రచ్చ మొదలైంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు పోరు..
జనవరి 14 సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ గొడవకు కారణం మ్యాచ్ ఫలితం కలిగించిన నిరాశేనంట. ఈ మ్యాచ్‌లో ఘనా జట్టు 1-0తో ముందంజలో ఉంది. అయితే ఆ తర్వాత గాబన్ 88వ నిమిషంలో గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఘనా నాకౌట్ ఫలితాలపై ప్రభావం చూపిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మైదానంలోనూ అదే ప్రభావం కనిపించింది.
ఘనా, గాబన్ ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ గొడవను వీడియోలో చూడవచ్చు. గాబన్ ఆటగాడి నోటిపై భారీ పంచ్ కొట్టిన ఘనా స్ట్రైకర్ బెంజమిన్ టెటెహ్ ఈ గొడవలో దోషిగా తేల్చారు. బెంజమిన్ టెటెహ్ చేసిన తప్పుకు శిక్షగా, రెఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో ఈ 24 ఏళ్ల స్ట్రైకర్ టెటెహ్ వచ్చే మంగళవారం జరిగే కొమొరోస్‌తో బరిలోకి దిగడానికి ఛాన్స్ లేదు. అయితే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. కానీ, ఈ ప్లేయర్ ఆ మ్యాచుకు అడేందుకు అనుమతి లేదు. అంటే మ్యాచ్ డ్రా కావడంతో ఘనా కష్టాలు ఎక్కువయ్యాయి. గాబన్ ఆటగాళ్ళతో తగాదాతో వారి తదుపరి మ్యాచులను మరింత సంక్షిష్టం చేసుకున్నారు.
Ghana’s Benjamin Tetteh has been shown a red card for violent conduct after the full-time whistle! ? pic.twitter.com/RAR8naKqOy
— Sky Sports Football (@SkyFootball) January 14, 2022
U19 World Cup: 27 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం..