SFA Championships 6th day: ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆరో రోజు.. చెలరేగిన యువ తుపాకీ వీరులు

|

Oct 22, 2024 | 7:22 PM

హైదరాబాద్ వేదికగా పలు స్టేడియంలలో జరుగుతున్న SFA ఛాంపియన్ షిప్ పోటీలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు 'ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్' అనే థీమ్‌తో యువ క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. ఈ ప్రదర్శనలు చూసేందుకు అధిక సంఖ్యలో విద్యార్ధుల తల్లిదండ్రులు తరలివచ్చారు..

SFA Championships 6th day: ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆరో రోజు.. చెలరేగిన యువ తుపాకీ వీరులు
SFA Championships
Follow us on

హైదరాబాద్, అక్టోబర్ 22: యువ క్రీడాకారుల ప్రదర్శనకు వేదిక అందించేందుకుTV9 నెట్‌వర్క్ SFAతో టై ఆప్ అయిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీలు హైదరాబాద్‌లోని పలు స్టేడియంలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని 12 నుంచి 14 , 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలు ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందులోని విజేతలకు 2025 జనవరిలో జర్మనీలో సత్కరించనున్నారు. దీనిలో భాగంగా ఆరో రోజు ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్’ అనే థీమ్‌తో పోటీలు జరిగాయి. యువ తుపాకీ క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. SFA ఛాంపియన్‌షిప్‌లు 2024 వేదికగా బాలబాలికలు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.

SFA ఛాంపియన్‌షిప్‌లు 2024 పోటీల్లో 6వ రోజున పిల్లలకు మద్దతునిచ్చేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పిల్లలు, వారి కుటుంబాలు SFA విలేజ్‌లో ఆటలను ఆస్వాధించారు. పలు చోట్ల జరిగిన ఆటల ప్రదర్శనను చూశారు. గచ్చిబౌలి స్టేడియంలో బాలికల U-14 బాస్కెట్‌బాల్ రౌండ్ 2తో నేటి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో మౌంట్ కార్మెల్ గ్లోబల్ స్కూల్‌కు చెందిన షేక్ అబ్దుల్ మన్నన్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. చెస్ U13, U15 బాలుర ఫైనల్స్‌పై అందరి దృష్టి నిలిచింది. మరోవైపు విస్టా ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బాలికలు U-14 బాలికల ఖో-ఖో ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వారి స్కూల్‌ లీడర్‌బోర్డ్‌లో ఎదగడంలో సహాయపడటానికి విజయం సాధించారు.

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో, శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో, తైక్వాండో బౌట్‌లు ప్రధాన వేదికగా నిలిచాయి. ది ఇంటిగ్రల్ స్కూల్‌కు చెందిన షేక్ ఉద్దీన్ పురుషుల అండర్ -19 విభాగంలో విజయం సాధించగా, డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన శ్రీయాన్ రంగు పురుషుల అండర్ -12 విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. టైక్వాండోతో పాటు, ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ రౌండ్ 2, క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. రాబోయే ఫైనల్స్ కోసం ఉత్కంఠగా మ్యాచ్‌లు జరిగాయి. శ్రీరామ్ స్కేటింగ్ రింక్‌లో అండర్-7 పురుషుల 200 మీటర్ల ఇన్‌లైన్ విభాగంలో గంగాస్ వ్యాలీ స్కూల్ (నిజాంపేట్)కు చెందిన చెర్విక్ రెడ్డి వెల్లపాళెం గెలుపొందగా, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఎల్‌బీ నగర్)కి చెందిన విధి అకరం 200 మీటర్ల ఇన్‌లైన్ ఫిమేల్ అండర్-11 విభాగంలో గెలుపొందింది. 6వ రోజు ముగిసేనాటికి విగ్నన్స్ బో ట్రీ స్కూల్ (నిజాంపేట్) స్కూల్ లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.