Australian Open 2021: ఆస్ట్రేలియన్​ ఓపెన్‌ను మరో చేజిక్కించుకున్న సెర్బియా స్టార్​.. తొమ్మిదవ ట్రోఫీని దక్కించుకున్న జకోవిచ్

|

Feb 21, 2021 | 8:52 PM

Novak Djokovic Wins: ర్బియన్​ టెన్నిస్​ నొవాక్​ జకోవిచ్ ఖాతాలో మరో టైటిల్ వచ్చిచేరింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్ పురుషుల సింగిల్స్​ టైటిల్  సెర్బియన్​ టెన్నిస్​ దిగ్గజం జకోవిచ్ సొంతం చేసుకున్నాడు.

Australian Open 2021: ఆస్ట్రేలియన్​ ఓపెన్‌ను మరో చేజిక్కించుకున్న సెర్బియా స్టార్​.. తొమ్మిదవ ట్రోఫీని దక్కించుకున్న జకోవిచ్
Novak Djokovic Wins
Follow us on

Australian Open 2021: సెర్బియన్​ టెన్నిస్​ నొవాక్​ జకోవిచ్ ఖాతాలో మరో టైటిల్ వచ్చిచేరింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్ పురుషుల సింగిల్స్​ టైటిల్  సెర్బియన్​ టెన్నిస్​ దిగ్గజం జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ విజేతగా మరోసారి జయకేతనం ఎగురవేశాడు. ఫైనల్లో రష్యా యువకెరటం మెద్వెదెవ్‌ను 7-5, 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. మొత్తంగా నొవాక్​కు ఇది 18వ గ్రాండ్​స్లామ్​.

మొదటి సెట్‌ హోరా హోరీగా సాగింది. ఈ సెట్‌ను 7-5తో గెలుచుకున్నాడు. రెండవ సెట్‌ నుంచి తన ఆదిపత్యంను కొనసాగించాడు జకోవిచ్… రెండు, మూడు రౌండ్లలో కనీస పోరాటం కూడా చేయలేదు. ఇప్పటికే ఆస్ట్రేలియన్​ ఓపెన్​ను 8 సార్లు చేజిక్కించుకున్న ఈ సెర్బియా స్టార్​కు.. ప్రస్తుత ట్రోఫీ తొమ్మిదవది.

కాగా గత పది మేజర్​ టోర్నీల్లో జకోవిచ్​ ఆరు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. మార్చి 11 వరకు నొవాక్​ నంబర్ 1 ర్యాంకుకు అడ్డు ఉండకపోవచ్చు. దీంతో 311 వారాల పాటు ఆ ర్యాంకులో ఉన్న ఫెదరర్  రికార్డును అధిగమించనున్నాడు ఈ సెర్బియా స్టార్​.

ఇవి కూడా చదవండి

EPFO New Enrolments: దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిన ఉద్యోగావకాశాలు.. కేవలం డిసెంబరులో కొత్తగా 8.04లక్షల ఉద్యోగాలు
Covid Second Wave: దేశవ్యాప్తంగా కరోనా వేవ్ మళ్లీ మొదలైందా…! ఇది సంధికాలమా..! పెరుగుతున్న గణాంకాలు దేనికి సంకేతం..