Neeraj Chopra: ప్రతిష్టాత్మక లారెస్ అవార్డ్స్ 2022కు నామినేట్ అయిన నీరజ్ చోప్రా..

|

Feb 02, 2022 | 5:33 PM

2021 సంవత్సరం భారతీయ క్రీడలకు ఎప్పటికీ చిరస్మరణీయం. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్ 2020లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ భారత్ 7 పతకాలు సాధించింది...

Neeraj Chopra: ప్రతిష్టాత్మక లారెస్ అవార్డ్స్ 2022కు నామినేట్ అయిన నీరజ్ చోప్రా..
Neeraj Chopra
Follow us on

2021 సంవత్సరం భారతీయ క్రీడలకు ఎప్పటికీ చిరస్మరణీయం. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్ 2020లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ భారత్ 7 పతకాలు సాధించింది. దీనితో పాటు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(neeraj chopra) టోక్యో ఒలింపిక్స్‌ను అత్యంత ప్రత్యేకమైనదిగా చేశాడు. పురుషుల జావెలిన్‌ త్రోలో నీరజ్‌ అత్యంత దూరం జావెలిన్‌ విసిరి బంగారు పతకం(gold madal) సాధించాడు. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ ఇప్పుడు క్రీడలలో అతిపెద్ద అంతర్జాతీయ గౌరవం లారెస్ అవార్డ్స్(laureus award) 2022 కి నామినేట్ అయ్యారు.

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ ఫైనల్‌లో నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలోనే 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరాడు. దీని తర్వాత ఏ ఆటగాడు ఈ దూరాన్ని దాటలేకపోయాడు. జర్మనీకి చెందిన సూపర్ స్టార్, స్వర్ణ పతకానికి అతిపెద్ద పోటీదారు అయిన జోహన్నెస్ వెటర్ కూడా విఫలమయ్యాడు. ఈ విధంగా 100 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించడమే కాకుండా తొలిసారి స్వర్ణం సాధించాడు నీరజ్.

నీరజ్ చోప్రా వెటరన్ షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రెండవ భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. నీరజ్ చోప్రా ‘వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్’ అంటే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గౌరవానికి లారెస్ స్పోర్ట్స్ ద్వారా నామినేట్ అయ్యాడు. ఇది కోసం క్రీడలలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ గౌరవం.

నీరజ్‌కి గత ఏడాది మాత్రమే భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది. ఇది కాకుండా, అతను గత నెలలో దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీకి కూడా ఎంపికయ్యాడు. నీరజ్ కంటే ముందు భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే లారస్ అవార్డుకు నామినేట్ అయ్యారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ 2019లో నామినేట్ కాగా, వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా 2020లో నామినేట్ అయ్యాడు.

Read Also.. ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల.. నాలుగో స్థానంలో భారత ఓపెనర్..