Junior Hockey World Cup: అద్భుత ప్రదర్శనతో సెమీస్ చేరిన భారత మహిళలు.. దక్షిణ కొరియాపై భారీ విజయం..

|

Apr 08, 2022 | 5:05 PM

దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా జరుగుతున్న జూనియర్ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు దక్షిణ కొరియాను ఓడించింది.

Junior Hockey World Cup: అద్భుత ప్రదర్శనతో సెమీస్ చేరిన భారత మహిళలు.. దక్షిణ కొరియాపై భారీ విజయం..
Fih Junior Hockey World Cup, Hockey India
Follow us on

శుక్రవారం జరిగిన జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా జరుగుతున్న జూనియర్ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు దక్షిణ కొరియాను ఓడించింది. భారత్ తరపున ముంతాజ్ ఖాన్, లాల్రిండికి, సంగీత కుమారి గోల్స్ చేశారు. అదే సమయంలో దక్షిణ కొరియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. జూనియర్ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే.

Also Read: IPL 2022 CSK vs SRH Head to Head: ఇరుజట్ల రికార్డుల్లో చెన్నైదే ఆధిపత్యం.. హైదరాబాద్‌కు మరోసారి ఓటమి తప్పదా..

Korea Open 2022: సెమీ ఫైనల్స్ చేరిన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్.. టైటిల్‌ వేటకు రెండడుగుల దూరంలోనే..