PV Sindhu crashed out : ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో పీవీ సింధు, సమీర్‌ వర్మకు చుక్కెదురు..

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో చుక్కెదురైంది. అలాగే పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ కూడా పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే సాత్విక్‌..

PV Sindhu crashed out : ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో పీవీ సింధు, సమీర్‌ వర్మకు చుక్కెదురు..

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 8:54 AM

PV Sindhu Crashed Out : స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో చుక్కెదురైంది. అలాగే పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ కూడా పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి అదరగొట్టే ప్రదర్శనతో జంట విజయాలు అందుకున్నాడు.

పురుషుల డబుల్స్‌, మిక్స్‌డ్‌లో అతడు సెమీఫైనల్‌కు దూసుకు పోయాడు. స్థానిక స్టార్‌, ఫేవరెట్‌ రచనోక్‌ ఇంటానన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు అత్యంత పేలవంగా ఆడింది. ఫలితంగా 13-21, 9-21 స్కోరుతో వరుస గేముల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సమీర్‌ వర్మ 13-21, 21-19, 20-22 స్కోరుతో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆంటొన్‌సెన్‌ చేతిలో పోరాడి ఓడాడు.