FIH World Cup 2023: 48 ఏళ్ల నిరీక్షణకు తెర పడేనా.. ఒడిశాలో మొదలైన హాకీ ప్రపంచ కప్‌.. భారత జట్టు పూర్తి షెడ్యూల్‌ ఇదే..

|

Jan 12, 2023 | 1:19 PM

India Hockey World Cup 2023 Full Schedule: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ 2023 జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. అర్జెంటీనా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో హాకీ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. మొదట్లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఉంటాయి. టోర్నీ తొలి రోజున భారత హాకీ జట్టు కూడా పోటీపడనుంది.

FIH World Cup 2023: 48 ఏళ్ల నిరీక్షణకు తెర పడేనా.. ఒడిశాలో మొదలైన హాకీ ప్రపంచ కప్‌.. భారత జట్టు పూర్తి షెడ్యూల్‌ ఇదే..
India Hockey World Cup 2023 Full Schedul
Follow us on

మరోసారి హాకీ అభిమానులు సంబురాలు చేసుకునే సమయం వచ్చింది. భారత్‌లో ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ 2023 మొదలైంది. 13 జనవరి 2023 నుంచి 29 జనవరి 2023 వరకు ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలాలో జరగనుంది. ఈసారి టోర్నీలో 16 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను నాలుగు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఈసారి ప్రపంచకప్‌లో భారత్ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

జనవరి 13 నుంచి 29 వరకు భువనేశ్వర్, రూర్కెలాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్ 2023లో ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్‌తో పాటు భారత్ గ్రూప్ డిలో ఉంచారు. జనవరి 13 (శుక్రవారం) నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఆ రోజు నాలుగు మ్యాచ్‌లు జరగనుండగా, ఆ రోజు చివరి మ్యాచ్ భారత జట్టుదే.

టోర్నమెంట్‌లో మొదట గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఆ తర్వాత జట్లు క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లు, ఆపై క్వార్టర్-ఫైనల్ ఆడనున్నాయి. ఆపై జనవరి 29న అర్హత సాధిస్తాయి. ఇక మూడో స్థానం కోసం ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతానికి, గ్రూప్ దశలో భారత పురుషుల హాకీ జట్టు పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఇండియా vs స్పెయిన్ – జనవరి 13 – రాత్రి 7 గంటలకు – రూర్కెలా

ఇండియా vs ఇంగ్లాండ్ – జనవరి 15 -రాత్రి 7 గంటలకు – రూర్కెలా

ఇండియా vs వేల్స్ – జనవరి 19 – రాత్రి 7 గంటలకు – రూర్కెలా

భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. దీంతో ప్రపంచ కప్ కరువుకు తెరపడుతుందని ఆశలు రేకెత్తించింది. భారత్ చివరిసారిగా 1975లో హాకీ ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి ఎదురుచూపులే మిగిలాయి. మరి ఈ ఏడాదైనా ఈ నిరీక్షణకు తెరపడుతుందో లేదో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..