Nationals Awards 2021: ఖేల్‌రత్న అవార్డుకు శ్రీజేశ్‌, దీపిక పేర్లు; హాకీ ఇండియా సిఫార్సులు

క్రీడాకారులకు అందించే అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్న అవార్డు, అలాగే అర్జున అవార్డులకు హాకీ ఇండియా పలువురి క్రీడాకారుల పేర్లను ప్రకటించింది. హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ను ఖేల్ రత్న పేరుకు నామినేట్ చేసింది.

Nationals Awards 2021: ఖేల్‌రత్న అవార్డుకు శ్రీజేశ్‌, దీపిక పేర్లు; హాకీ ఇండియా సిఫార్సులు
Hockey India Nationals Awards 2021

Updated on: Jun 27, 2021 | 11:32 AM

Nationals Awards 2021: క్రీడాకారులకు అందించే అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్న అవార్డు, అలాగే అర్జున అవార్డులకు హాకీ ఇండియా పలువురి క్రీడాకారుల పేర్లను ప్రకటించింది. హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ను ఖేల్ రత్న పేరుకు నామినేట్ చేసింది. అలాగే శ్రీజేశ్ పేరుతోపాటు మాజీ మహిళా క్రీడాకారిణి దీపిక పేరును కూడా కేంద్ర క్రీడాశాఖకు నామినేట్ చేసింది. హర్మన్‌ప్రీత్‌సింగ్‌, వందనా కటారియా, నవజ్యోత్‌ కౌర్‌ తదితర ప్లేయర్ల పేర్లను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. అలాగే జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్ టైం అచీవ్‌మెంట్)(ధ్యాన్ చంద్ అవార్డు) కోసం మాజీ ప్లేయర్లు డా.ఆర్‌పీ సింగ్‌, సంఘాయ్‌ ఇబెంహాల్‌తోపాటు కోచ్‌లు బీజే కరియప్ప, సీఆర్‌ కుమార్‌ పేర్లను కూడా హాకీ ఇండియా ప్రకటించింది.

కాగా, హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2018లో నెదర్లాండ్స్‌లో జరిగిన హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు వెండి పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో రజతం గెలవడంలోనూ శ్రీజేశ్‌ ప్రముఖ పాత్ర పోషించాడు. 2019లో భువనేశ్వర్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ మెన్స్‌ సిరీస్‌ ఫైనల్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకోవడంలోనూ చురుకైన పాత్ర పోషించాడు. ఇలా దేశ, విదేశాల్లో హాకీ జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2015లో అర్జున అవార్డుతో సత్కరించింది. అలాగే 2017లో పద్మశ్రీ అవార్డును అందించింది. ప్రస్తుతం ఖేల్ రత్న అవార్డుకు హాకీ ఇండియా శ్రీజేవ్ పేరును నామినేట్ చేసింది.

ఇక భారత మహిళ జట్టు సాధించిన విజయాల్లో ప్రముఖ క్రీడాకారిణి దీపిక కీలక పాత్ర పోషించింది. 2018 ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించడంతోపాటు 2018లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ హాకీ జట్టు రజత పతకం గెలిచేందుకు దీపక ప్రముఖ పాత్ర పోషించింది. ఈ ఏడా ప్రదానం చేసే అవార్డులకు 2017 జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు హాకీ ఇండియా పలురురి పేర్లను నామినేట్ చేసింది.


Also Read:

INDW vs ENGW 1st ODI Preview: ఇంగ్లండ్‌తో భారత మహిళల పోరు; నేడు బ్రిస్టల్‌ మొదటి వన్డే

WI vs SA : మొదటి టీ 20 లో ఇరగదీసిన లూయిస్, గేల్..! 15 ఓవర్లలో 15 సిక్స్‌లు.. ఫలితంగా వెస్టీండీస్ ఘన విజయం..

ENG vs SL: మలాన్ మాయ.. మూడో టీ20లోనూ ఇంగ్లండ్ ఘన విజయం; సిరీస్‌ క్లీన్‌స్వీప్