FIFA World Cup 2026 : వరుసగా రెడ్ కార్డులు.. ఫిఫా వరల్డ్‌కప్ 2026లో కొత్త రికార్డుల దిశగా టోర్నీ!

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్ 2026లో గ్రూప్ దశ పూర్తికాకముందే 6 రెడ్ కార్డులు నమోదయ్యాయి. 2018, 2022 ప్రపంచకప్‌లను అధిగమిస్తూ ఈ టోర్నీ కొత్త రికార్డుల దిశగా సాగుతోంది. కఠినమైన VAR అమలు, రిఫరీ నిర్ణయాలు, పెరిగిన పోటీ ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

FIFA World Cup 2026 : వరుసగా రెడ్ కార్డులు.. ఫిఫా వరల్డ్‌కప్ 2026లో కొత్త రికార్డుల దిశగా టోర్నీ!
Fifa World Cup 2026

Edited By:

Updated on: Jun 20, 2026 | 11:16 AM

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గోల్స్, ఉత్కంఠభరిత పోరాటాలు, సంచలన ఫలితాలే కాదు.. క్రమశిక్షణా ఉల్లంఘనలకు కూడా వేదికగా నిలుస్తుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో రెడ్ కార్డులు వర్షంలా కురుస్తుండటం ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గ్రూప్ దశ ఇంకా పూర్తికాకముందే ఇప్పటికే 6 రెడ్ కార్డులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

గత రెండు ప్రపంచకప్‌ల గణాంకాలను పరిశీలిస్తే ఈ ట్రెండ్ ఎంత భిన్నంగా ఉందో అర్థమవుతోంది. 2018 ఫిఫా వరల్డ్‌కప్ మొత్తం టోర్నీలో కేవలం 4 రెడ్ కార్డులు మాత్రమే నమోదయ్యాయి. అలాగే ఖతార్ వేదికగా జరిగిన 2022 ప్రపంచకప్‌లో కూడా 4 రెడ్ కార్డులే నమోదయ్యాయి. కానీ 2026 ఎడిషన్‌లో మాత్రం గ్రూప్ స్టేజ్ మధ్యలోనే ఆ సంఖ్య 6కు చేరుకోవడం విశేషం.ఆటగాళ్ల మధ్య పెరుగుతున్న పోటీ, కీలక మ్యాచ్‌ల ఒత్తిడి, దూకుడు వ్యూహాలు, రిఫరీల కఠిన నిర్ణయాలు రెడ్ కార్డుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా VAR సాంకేతికతను మరింత కఠినంగా అమలు చేయడం వల్ల ప్రమాదకర ఫౌల్స్, అసభ్య ప్రవర్తనపై అధికారులు ఏమాత్రం రాజీ పడటం లేదని చెబుతున్నారు.

ఇంకా గ్రూప్ దశలోనే ఈ స్థాయిలో రెడ్ కార్డులు నమోదవడంతో నాకౌట్ రౌండ్లలో పరిస్థితి ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఇదే జోరు కొనసాగితే 2026 ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక రెడ్ కార్డులు నమోదైన టోర్నీల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫుట్‌బాల్ అభిమానులు ఇప్పుడు గోల్స్‌తో పాటు రెఫరీ జేబులోంచి బయటకు వచ్చే ఎర్ర కార్డు వైపు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us