Winter Olympics: వింటర్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. ప్రారంభానికి ఒకరోజు ముందు భారీగా కేసులు నమోదు..!

|

Feb 03, 2022 | 12:36 PM

బుధవారం ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన సిబ్బందిలో మొత్తం 55 కొత్త కోవిడ్-19(Covid-19) ఇన్‌ఫెక్షన్‌లు కనిపించాయని బీజింగ్ 2022 వైద్య నిపుణుల ప్యానెల్ గురువారం ప్రకటించింది.

Winter Olympics: వింటర్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. ప్రారంభానికి ఒకరోజు ముందు భారీగా కేసులు నమోదు..!
2022 Beijing Winter Olympics
Follow us on

Winter Olympics: వింటర్ ఒలింపిక్ 2022(2022 Beijing Winter Olympics) క్రీడలు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఫిబ్రవరి 2న ఇక్కడ కరోనా(Coronavirus) కొత్త వేరియంట్ కలకలం రేపింది. ఒక్కసారిగా అత్యధిక కేసులు నమోదు కావడంతో ఒలింపిక్ అధికారులు అయోమయంలో పడ్డారు. బుధవారం ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన సిబ్బందిలో మొత్తం 55 కొత్త కోవిడ్-19(Covid-19) ఇన్‌ఫెక్షన్‌లు కనిపించాయని బీజింగ్ 2022 వైద్య నిపుణుల ప్యానెల్ గురువారం ప్రకటించింది. ఇది ఇప్పటివరకు ఇక్కడ వెలుగుచూసిన రోజువారీ కేసుల సంఖ్యలో అత్యధికం కావడం గమనార్హం.

కొత్తగా విమానాల రాకపోకలకు సంబంధించి ఇరవై తొమ్మిది కేసులు కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వింటర్ ఒలింపిక్స్ అధికారిక ప్రారంభానికి ముందు రోజు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌లో బ్రియాన్ మెక్‌క్లోస్కీ వెల్లడించారు. అయితే 26 మంది ఈవెంట్ సిబ్బందిని ప్రజల నుంచి వేరు చేసే “క్లోజ్డ్ లూప్” బబుల్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు.

జనవరి 23 నుంచి మొత్తం 610,000 పరీక్షలలో ఆటలకు సంబంధించిన సిబ్బందిలో 287 మంది పాజిటివ్‌గా తేలారు. “అయితే ఈ సంఖ్య చాలా చిన్నదే. అయినా ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. ముందుముందు మరిన్ని కఠిన నియమాలు అమలు చేయనున్నాం” అని మెక్‌క్లోస్కీ పేర్కొన్నారు. ఆటలు ప్రారంభమయ్యాక, అలాగే ఆటగాళ్లు అంతా వచ్చాక కేసుల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.

“బయో బబుల్ ఏర్పాటు చేశాం. ఇది సమర్థంగా పని చేస్తుందని మాకు నమ్మకం ఉంది. కానీ, మేం ఎలాంటి సడలింపులు ఇవ్వదలుచుకోలేదు. అన్ని చర్యలను తీసుకుని, వింటర్ ఒలింపిక్స్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాం” అని మెక్‌క్లోస్కీ పేర్కొన్నారు. బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేవారు సాధారణ ప్రజలతో సంబంధాన్ని నిరోధించడానికి “క్లోజ్డ్ లూప్”కి పరిమితం చేయనున్నారు. అధికారిక రవాణాతోపాటు వసతి కూడా కఠిన నిబంధనలతో రూపొందించినట్లు ఆయన తెలిపారు.

లూప్‌లో ఏవైనా ఇన్‌ఫెక్షన్‌లను త్వరగా గుర్తించే ప్రయత్నంలో ప్రతి గేమ్‌లలో పాల్గొనేవారిని ప్రతిరోజూ పరీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. COVID-19 తో జీవించాలని కోరుకునే అనేక దేశాలకు భిన్నంగా చైనా జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబించింది. ఇందులో కఠినమైన సరిహద్దు నియంత్రణలతోపాటు దాదాపు అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఒలింపిక్ పాల్గొనే వారందరూ చార్టర్ విమానాలలో వస్తున్నట్లు ఆయన తెలిపారు.

భారత జట్టులో ఒకరు..
భారత వింటర్ ఒలింపిక్స్-2022 జట్టు మేనేజర్ మహ్మద్ అబ్బాస్ వానీ బీజింగ్ విమానాశ్రయానికి చేరుకోగానే కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. అబ్బాస్ వానీ ఆరుగురు సభ్యుల భారత బృందంలో భాగం. ఇందులో కాశ్మీర్‌కు చెందిన స్కీయర్ ఆరిఫ్ ఖాన్ ఏకైక ఆటగాడు. ఆరిఫ్ స్లాలమ్, జెయింట్ స్లాలమ్ విభాగాల్లో పాల్గొంటారు. భారత జట్టు చీఫ్‌గా హర్జిందర్ సింగ్, ఎల్‌సి ఠాకూర్ ఆల్పైన్ కోచ్‌గా, పురన్ చంద్ టెక్నీషియన్, రూప్ చంద్ నేగి జట్టు అధికారులుగా ఉన్నారు.

కాగా, ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్న ఈ గేమ్స్ ఫిబ్రవరి 20 వరకు జరుగుతాయి. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు జరగనున్నాయి. 31 ఏళ్ల స్కీయర్ ఆరిఫ్ ఖాన్ ఈ వింటర్ ఒలింపిక్ క్రీడలలో భారతదేశం నుంచి పాల్గొంటున్న ఏకైక ఆటగాడు. ఆరిఫ్ రెండు ఈవెంట్లలో పోటీపడనున్నాడు. టాప్ 30లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు చెందిన ఆరిఫ్ ఈ గేమ్‌లలో స్లాలమ్, జెయింట్ స్లాలమ్ విభాగాల్లో పాల్గొంటాడు. మరియు ఈ ఈవెంట్‌లు ఫిబ్రవరి 13, 16 తేదీల్లో జరుగుతాయి. సపోరోలో జరిగిన 2017 ఆసియా వింటర్ గేమ్స్‌లో కూడా ఆరిఫ్ పాల్గొన్నాడు.

Also Read: IND vs WI: గవాస్కర్ నుంచి సచిన్ వరకు.. అహ్మదాబాద్‌లో రికార్డుల మోత.. తాజాగా టీమిండియా కూడా..

IND vs WI: ఆయనతో నాకు ఎలాంటి పోలిక లేదు: హార్దిక్ పాండ్యాతో పోలికలపై టీమిండియా ఆల్ రౌండర్ కీలక వ్యాఖ్యలు