Asian Games 2026: పీటీ ఉష 42 ఏళ్ల రికార్డు బద్దలు.. ఏషియన్ గేమ్స్‌లో సంచలనం సృష్టించిన భారత అథ్లెట్

Asian Games 2026: మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్‌రాజ్ 54.75 సెకన్లలో రేసు పూర్తి చేసి కాంస్య పతకం సాధించారు. ఈ క్రమంలో పీటీ ఉష 1984లో నెలకొల్పిన 55.42 సెకన్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టారు. విత్యాకు ఈ ఏషియన్ గేమ్స్‌లో ఇది రెండో పతకం. మిక్స్‌డ్ రిలేలో ఇప్పటికే రజతం సాధించారు.

Asian Games 2026: పీటీ ఉష 42 ఏళ్ల రికార్డు బద్దలు.. ఏషియన్ గేమ్స్‌లో సంచలనం సృష్టించిన భారత అథ్లెట్
Vithya Ramraj

Edited By:

Updated on: Sep 29, 2026 | 8:43 AM

Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ విత్యా రామ్‌రాజ్ చరిత్ర సృష్టించారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ పోటీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భారత లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష గత 42 సంవత్సరాలుగా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న జాతీయ రికార్డును ఆమె బద్దలు కొట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన విత్యా రామ్‌రాజ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అథ్లెటిక్స్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు.

భారత అథ్లెటిక్స్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా నిలిచిన అరుదైన రికార్డు ఎట్టకేలకు బద్దలైంది. ఆసియా క్రీడలు–2026లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో భారత అథ్లెట్ విథ్యా రామరాజ్ అద్భుత ప్రదర్శన చేసింది. 54.75 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించడంతో పాటు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషా పేరిట ఉన్న 55.42 సెకన్ల జాతీయ రికార్డును అధిగమించింది.

42 ఏళ్ల రికార్డుకు తెర..

పీటీ ఉషా 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో 55.42 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ రికార్డు కొనసాగింది. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో విథ్యా అదే 55.42 సెకన్ల టైమింగ్‌ను నమోదు చేసి ఉషా రికార్డును సమం చేసింది. ఇప్పుడు నాగోయాలో 54.75 సెకన్లతో దాన్ని అధిగమించింది.

ఉషా ఏమన్నారంటే..?

విథ్యా చరిత్ర సృష్టించడంపై పీటీ ఉషా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. “రికార్డులు బద్దలు కావడానికే ఉంటాయి. మనం నిర్దేశించిన హద్దులను తర్వాతి తరం అధిగమించడం కంటే ఒక అథ్లెట్‌కు గొప్ప బహుమతి మరొకటి లేదు” అని ఉషా పేర్కొన్నారు.

తన 400 మీటర్ల హర్డిల్స్ రికార్డును విథ్యా బద్దలు కొట్టడం తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణమని ఉషా అన్నారు. అథ్లెట్లు తమను తాము సవాలు చేసుకుంటూ, పరిమితులను అధిగమిస్తూ ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు.

రికార్డు కంటే దాని స్ఫూర్తే గొప్పది..

దశాబ్దాల పాటు నిలిచిన రికార్డును ఎంతకాలం కాపాడుకున్నామన్నది కాకుండా, అది తర్వాతి తరం అథ్లెట్లను మరింత ముందుకు వెళ్లేందుకు ఎంతగా ప్రేరేపించిందన్నదే అసలైన వారసత్వమని పీటీ ఉషా అభిప్రాయపడ్డారు. విథ్యా సాధించిన ఈ ఘనత కేవలం ఆమె వ్యక్తిగత విజయమే కాకుండా భారత అథ్లెటిక్స్‌కు కూడా గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.

విథ్యాకు కాంస్య పతకం..

విథ్యా రామరాజ్ 54.75 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌తో కాంస్య పతకం సాధించింది. యూఏఈకి చెందిన మరియం కరీమ్ 54.31 సెకన్లతో స్వర్ణం, కజకిస్థాన్‌కు చెందిన అడెలినా జెమ్స్ 54.58 సెకన్లతో రజతం గెలుచుకున్నారు.

ఈ ఆసియా క్రీడల్లో విథ్యాకు ఇది రెండో పతకం. అంతకుముందు మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు రజతం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

ఇప్పటివరకు భారత్ సాధించిన స్వర్ణ పతకాలు

ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించిన మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. అలాగే పురుషుల, మహిళల కబడ్డీ జట్లు తమ జోరును కొనసాగించి స్వర్ణాలు సాధించాయి. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కమల్‌జీత్, సురుచి సింగ్ జోడీ కూడా బంగారు పతకాన్ని గెలుచుకుని దేశం గర్వపడేలా చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

Loading...
Unable to load recommendations.
Follow Us