Tokyo Olympics 2021 : ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే 6 కోట్లు.. రజతానికి 4 కోట్లు..! ముందే ప్రోత్సాహకాల ప్రకటన

|

Jul 09, 2021 | 5:53 AM

Tokyo Olympics 2021 : ఈ నెల 23 నుంచి టోక్యో ఒలంపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఇందులో పాల్గొనే క్రీడాకారులకు ఒడిశా

Tokyo Olympics 2021 : ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే 6 కోట్లు.. రజతానికి 4 కోట్లు..! ముందే ప్రోత్సాహకాల ప్రకటన
Naveen Patnaik
Follow us on

Tokyo Olympics 2021 : ఈ నెల 23 నుంచి టోక్యో ఒలంపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఇందులో పాల్గొనే క్రీడాకారులకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ముందుగానే ప్రోత్సహకాలు ప్రకటించారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.6కోట్లు, రజతం సాధిస్తే రూ.4కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లు చొప్పున బహుమతి అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికీ రూ.15లక్షలు చొప్పున ఇస్తామన్నారు. క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు తెలిపారు.

ముందుగా ఆయన ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కల అన్నారు. తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ద్యుతి చంద్‌, ప్రమోద్‌ భగత్‌, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, నమిత టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్‌ రోహిదాస్‌లకు నవీన్‌ పట్నాయక్‌ అభినందనలు తెలిపారు. ‘ఒడిశా యువతకు మీరు రోల్‌ మోడల్‌. మీ కుటుంబాలతో పాటు మా అందరికీ మీరు గర్వకారణం. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఒలింపిక్స్‌లో ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నా’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టీకే బెహ్రా పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఈక్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి ఈ పోటీలకు దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. అయితే, ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఆందోళన కలిగిస్తోంది. టోక్యోలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టోక్యో చేరుకున్న కొంతమంది అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌గా రావడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతోపాటు జపాన్ ప్రభుత్వం హైరానా పడుతోందంట. ఈమేరకు మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. జులై 23 కు వారం రోజుల ముందు నుంచి ప్రపంచవ్యాప్తంగా వేలాది అథ్లెట్లు టోక్యో చేరుకోనున్నారు. ఇప్పటివకే ఒలింపిక్ విలేజ్ లో రెండు కరోనా కేసులు నమోదవడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.