King Kohli: కోహ్లీ చేతికి ఆరెంజ్ క్యాప్.. ఐపీఎల్ లో అత్యధిక పరుగుల వీరులు వీళ్లే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నమెంట్ క్రికెట్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. సిక్సులు, ఫోర్లతో తమ అభిమాన ఆటగాళ్లు రెచ్చిపోతుంటే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభమై వారం అవుతోంది. దీంతో పాయింట్ల పట్టికలో దూసుకుపోయేందుకు అన్ని జట్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు రంగంలోకి దిగుతాయి.

King Kohli: కోహ్లీ చేతికి ఆరెంజ్ క్యాప్.. ఐపీఎల్ లో అత్యధిక పరుగుల వీరులు వీళ్లే!
Virat Kohli

Updated on: Mar 31, 2024 | 8:44 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నమెంట్ క్రికెట్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. సిక్సులు, ఫోర్లతో తమ అభిమాన ఆటగాళ్లు రెచ్చిపోతుంటే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభమై వారం అవుతోంది. దీంతో పాయింట్ల పట్టికలో దూసుకుపోయేందుకు అన్ని జట్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు రంగంలోకి దిగుతాయి. ఇప్పటివరకు మొత్తం పదకొండు మ్యాచ్‌లు జరగగా, కొంతమంది బ్యాటర్ల తమ బ్యాటింగ్ తో చుక్కలు చూపించారు.

ఆరెంజ్‌ క్యాప్‌ జాబితాలో ఆర్‌సీబీ స్టార్‌ బ్యాట్స్ మెన్ విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 181 పరుగులు సాధించడంతో క్యాప్ చేతికందింది. ఇక హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 143 పరుగులు చేశాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేసి మూడో స్థానానికి ఎగబాకాడు.

అయితే శనివారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ పంజాబ్ కింగ్స్ తో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో గుజరాత్-హైదరాబాద్, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ-సీఎస్‌కే తలపడనున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది. అతను ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండింటినీ గెలిచాడు. నాలుగు పాయింట్లు సాధించాడు.ఇక శ్రేయాస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఆర్‌సీబీపై విజయం సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లు సాధించింది. ఇక పర్పుల్-క్యాప్ జాబితాలో CSK బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ మొత్తం 6 వికెట్లతో అగ్రస్థానాన్ని ఉన్నాడు. అయితే గత టెస్టు మ్యాచ్ లకు దూరమైన కోహ్లీ ఈ పొట్టి ఫార్మెట్ లో రెచ్చిపోయి పరుగులు సాధిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు.