ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో మాత్రమే…

| Edited By: Anil kumar poka

Mar 27, 2019 | 4:44 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ లీగ్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏ ఐపీఎల్ మ్యాచ్‌లో అయినా.. ఇరు జట్లలో కలిపి కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. కానీ మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కేవలం ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో మాత్రమే బరిలోకి దిగుతున్నాయి. […]

ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో మాత్రమే...
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ లీగ్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏ ఐపీఎల్ మ్యాచ్‌లో అయినా.. ఇరు జట్లలో కలిపి కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. కానీ మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కేవలం ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో మాత్రమే బరిలోకి దిగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహీర్ ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొలిన్ ఇన్‌గ్రామ్, కీమో పాల్, కగిసో రబాడా ఆడుతున్నారు.

అయితే ఐపీఎల్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి. ఇప్పటికే ఇరు జట్లు ఆడిన తొలి మ్యాచుల్లో విజయం సాధించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై అదే జట్టుని కొనసాగిస్తుండగా.. ఢిల్లీ ట్రెంట్ బోల్డ్ స్థానంలో అమిత్ మిశ్రాను జట్టులోకి తీసుకుంది.