Cricket Australia: ఆసిస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు షాక్ ఇచ్చింది. అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్‌లో సిక్సర్స్ బౌలర్ స్టీవ్ ఓ కీఫీ వేసిన 13వ ఓవర్లో మార్స్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. బౌలర్ అప్పీల్ చేయడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.
దీంతో మార్ష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బ్యాట్ నేలకేసి కొట్టాడు. తప్పుగా అవుట్ ఇచ్చాడంటూ అంపైర్ తీరును తప్పుపట్టాడు. ఆ సందర్భంగా పరుష పదజాలంతో అంపైర్‌ను దూషించాడు. అయితే మిచెల్ చర్యను తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అతనిపై చర్యలకు ఉపక్రమించింది. అతని తీరును తప్పుపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ 5వేల ఆస్ట్రేలియన్ డాలర్ల(రూ.2.8 లక్షలు) ఫైన్ విధించింది. మరోవైపు తన తప్పుు తెలుసుకున్న మిచెల్ మార్ష్.. తాను అలా చేసి ఉండాల్సి కాదంటూ క్షమాపణలు కోరాడు. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయబోనని స్పష్టం చేశాడు.
Also read:
Buffalo: రెజ్లింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రెజర్లకు బహుమతిగా ‘గేదె’.. దాని విలువ ఎంతంటే..
India vs England: టీమిండియా సారథి కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలి