వన్డేలకు ధావన్ దూరం.. మయాంక్‌కు పిలుపు!

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలి గాయం కారణంగా విండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. అతడి స్థానంలో టెస్ట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఎంపిక చేయడం జరిగింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడిన ధావన్‌ మోకాలికి గాయం కాగా.. టీ20 సిరీస్‌కు అతడు దూరం అయ్యాడు. ఇక కేరళ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ధావన్ గాయం ఇంకా నయం కాలేదని తెలుస్తోంది. డాక్టర్లు మరికొన్ని […]

వన్డేలకు ధావన్ దూరం.. మయాంక్‌కు పిలుపు!

Updated on: Dec 11, 2019 | 9:36 PM

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలి గాయం కారణంగా విండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. అతడి స్థానంలో టెస్ట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఎంపిక చేయడం జరిగింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడిన ధావన్‌ మోకాలికి గాయం కాగా.. టీ20 సిరీస్‌కు అతడు దూరం అయ్యాడు. ఇక కేరళ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా ధావన్ గాయం ఇంకా నయం కాలేదని తెలుస్తోంది. డాక్టర్లు మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో.. డిసెంబర్ 15 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండదు. కాగా, ఇవాళ విండీస్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ భారీ స్కోర్ సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విజృభించడంతో.. నిర్ణీత 20 ఓవర్లకు 240 పరుగులు చేసింది.