IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి విదితమే. ఆ డెడ్‌లైన్ నేటితో ముగియడంతో.. టీంల వారీగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితాను ఐపీఎల్ యాజమాన్యం కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించింది. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ టీమ్స్ | రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితా | మిగిలిన అమౌంట్ | ఓవర్సీస్ స్లాట్స్ |
---|---|---|---|
ముంబై ఇండియన్స్ | మలింగా, కౌల్టర్‌నైల్, పాటిన్సన్, మెక్‌లేగ్హన్, షేన్ రూటర్‌ఫోర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్ బల్వంత్ | రూ. 15.35 కోట్లు | 4 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీ, స్టెయిన్, ఉదానా, శివమ్ దూబే, ఉమేష్ యాదవ్, పార్థివ్ పటేల్, పవన్ నేగి, గుర్కీరాట్ సింగ్ మనన్ | రూ. 35.7 కోట్లు | 4 |
ఢిల్లీ క్యాపిటల్స్ | అలెక్స్ క్యారీ, కీమో పాల్, లమిచన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ శర్మ, సామ్స్, జాసన్ రాయ్ | రూ. 12.8 కోట్లు | 2 |
సన్ రైజర్స్ హైదరాబాద్ | బిల్లీ స్టాంక్లేక్, ఫాబియన్ అలెన్, సందీప్ బావనక, సంజయ్ యాదవ్, పృథ్వీ రాజ్ | రూ. 10.75 కోట్లు | 1 |
రాజస్థాన్ రాయల్స్ | స్టీవ్ స్మిత్, ఒషానే థామస్, టామ్ కుర్రాన్, వరుణ్ ఆరోన్, అంకిత్ రాజ్‌పుత్, అనిరుద్, ఆకాష్ సింగ్, శశాంక్ సింగ్ | రూ. 34.85 కోట్లు | 3 |
కోల్‌కతా నైట్ రైడర్స్ | టామ్ బంటన్, క్రిస్ గ్రీన్, నిఖిల్ నైక్, సిద్దేశ్ లాడ్, ఎం. సిద్ధార్ద్ | రూ. 10.85 కోట్లు | 2 |
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | మాక్స్‌వెల్, విల్జోయిన్, కాట్రెల్, ముజీబ్, నీషమ్, కృష్ణప్ప గౌతమ్, కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ | రూ. 53.2 కోట్లు | 5 |
చెన్నై సూపర్ కింగ్స్ | షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా, మోను సింగ్ | రూ. 22.9 కోట్లు | 1 |