టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇకపై క్రికెట్‌కు కాస్త గ్యాప్ ఇవ్వనున్నాడు. సిల్వర్ స్రీన్‌పై తన ఫేట్ టెస్టు చేసుకోబోతున్నాడు. తమిళ సూపర్‌స్టార్ విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు విక్రమ్. ఈ విషయాన్ని ఈ క్రేజీ క్రికెటర్ స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నాడు. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మూవీలో విక్రమ్ 25 గెటప్స్‌లో నటించనున్నట్లు సమాచారం. కాగా చిత్ర టైటిల్ ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఙ్ఞానముత్తు గతంలో ‘డిమొంటే కాలనీ’, ‘ఇమైక్క నొడిగల్’ సినిమాలకు దర్శకత్వం వహించారు.
అయితే, ఈ సినిమాలో ఓ టర్కీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై సినిమా నిర్మాణం కానుంది. కాగా, 2012లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ ఇర్ఫాన్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు ఇర్ఫాన్. ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నాడు.
New venture,new challenge looking forward to it
@AjayGnanamuthu @iamarunviswa @7screenstudio
@arrahman
@Lalit_SevenScr #ChiyaanVikram58 @sooriaruna
@proyuvraaj @LokeshJey@VishalSaroee pic.twitter.com/yZ99OZyJrl— Irfan Pathan (@IrfanPathan) October 14, 2019
Proud and honoured to introduce @IrfanPathan in #ChiyaanVikram58 in a super stylish action avatar!! Welcome on Board Sir and Wish you a sensational debut??#IrfanPathan #BCCI@AjayGnanamuthu @Lalit_SevenScr @arrahman @sooriaruna @iamarunviswa @proyuvraaj @LokeshJey pic.twitter.com/mQTPVFPbU5
— Seven Screen Studio (@7screenstudio) October 14, 2019