Delhi Capitals vs Lucknow Super Giants: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ అభిషేక్ పొరెల్ ( 33 బంతుల్లో 58, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆరంభంలో అదరగొట్టగా, ఆఖరులో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అలాగే షై హోప్ ( 27 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్ ( 23 బంతుల్లో 33, 5 ఫోర్లు) కూడా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ 2, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇప్పుడు ఈ టార్గెట్ ను ఛేదించాల్సిన బాధ్యత లక్నో సూపర్ జెయింట్ బ్యాటర్లపై నే ఉంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోతే ప్లేఆఫ్‌ల లెక్కలు చాలా క్లిష్టంగా మారతాయి. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ చాలా తక్కువ. అందుకే, RCB, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ తెలియకుండానే లాభపడతాయి.
Two stylish strokes, 1 result 💥
Tristan Stubbs reaches his fifty in style 🚀
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/4DacwQUuFP
— IndianPremierLeague (@IPL) May 14, 2024
అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్ /వికెట్ కీపర్) , ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్
KL రాహుల్ (కెప్టెన్ /వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
మణిమారన్ సిద్ధార్థ్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్
Taken on the second attempt 😎
Partnership broken thanks to a Klassy catch 💪
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvLSG | @klrahul | @LucknowIPL pic.twitter.com/0EVa392SKT
— IndianPremierLeague (@IPL) May 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..