ఐపీఎల్ 2021: వేలంలోకి విదేశీ బిగ్ ప్లేయర్స్.. ఆ ఐదుగురిపైనే అందరి స్పెషల్ ఫోకస్..!

|

Jan 21, 2021 | 6:39 PM

IPL 2021: అనేక మంది విదేశీ స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2021 మినీ వేలంలోకి వచ్చారు. వారిలో పలువురు డొమెస్టిక్ టీ20లలో మంచి ప్రదర్శన....

ఐపీఎల్ 2021: వేలంలోకి విదేశీ బిగ్ ప్లేయర్స్.. ఆ ఐదుగురిపైనే అందరి స్పెషల్ ఫోకస్..!
IPL 2021
Follow us on

IPL 2021: స్టీవ్ స్మిత్.. డేవిడ్ మాలన్… మ్యాక్స్‌వెల్.. స్టార్క్.. జేమిసన్.. ఇలా ఒకరిద్దరు కాదు.. అనేక మంది విదేశీ స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2021 మినీ వేలంలోకి వచ్చారు. వారిలో పలువురు డొమెస్టిక్ టీ20లలో మంచి ప్రదర్శన కనబరుస్తుండగా.. మరికొందరు ప్రపంచశ్రేణీ ఆటగాళ్లు అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే పలు ఫ్రాంచైజీలు తమ జట్లను బలపరుచుకునేందుకు సిద్దమవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు పలువురు ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరి ఏ ఫ్రాంచైజీ.. ఏయే విదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకుంటారు వేచి చూడాలి..!

వేలంలో విదేశీ ప్లేయర్స్ లిస్ట్ ఇదే…

స్టీవ్ స్మిత్, డేవిడ్ మాలన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌సన్, గ్లెన్ ఫిలిప్స్, జేమిసన్, మెరెడిత్, హసరంగా, స్టార్క్, వాండర్ డుస్సెన్, బాంటన్, లివింగ్‌స్టన్, బిల్లింగ్స్, లబూషేన్, బెన్ కట్టింగ్, ఆడమ్ మిలనే, ఎల్లిస్, అల్లెన్, మోరిస్