IPL 2021 Auction: నేడే ఐపీఎల్ 2021 ఆక్షన్‌.. అందరి చూపు ఆ ఐదుగురిపైనే.. ఎవరెవరో తెలుసా..?

| Edited By: Pardhasaradhi Peri

Feb 18, 2021 | 12:19 PM

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మెగా ఆక్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ రోజు చెన్నై వేదికగా బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ ఆక్షన్ గ్రాండ్‌గా..

IPL 2021 Auction: నేడే ఐపీఎల్ 2021 ఆక్షన్‌.. అందరి చూపు ఆ ఐదుగురిపైనే.. ఎవరెవరో తెలుసా..?
Follow us on

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మెగా ఆక్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ రోజు చెన్నై వేదికగా బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ ఆక్షన్ గ్రాండ్‌గా జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా కుదరలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఫ్రాంచైజీల కోసం మినీ ఆక్షన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ వేలం కోసం క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఈ జాబితాలో 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. మొత్తం 292 మందికి అనుమతి దక్కింది. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

ఐపీఎల్ 2021 మెగా ఆక్షన్‌ నేపథ్యంలో అంతటా ఐదుగురు ముఖ్య క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్ ప్లేయర్ డేవిడ్ మలన్‌, ఆఫ్ఘాన్ క్రికెటర్ ముజీబుర్ రెహ్మాన్ పై ప్రాంఛైజీలు గురి సాధించినట్లు తెలుస్తోంది. ఆక్షన్ నేపథ్యంలో వీరి గురించి అంతటా చర్చ నడుస్తోంది.

మాక్స్‌వెల్: 2014 ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మాక్స్‌వెల్.. పంజాబ్‌ను తొలిసారి ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా నిలిచాడు. వేలానికి వెళ్లిన ప్రతిసారీ రూ.10 కోట్ల పైచిలుకు పలికే ఈ భారీ హిట్టర్‌ కొన్నాళ్లుగా ఐపీఎల్‌లో రాణించడం లేదు. గతేడాది పంజాబ్‌ అతడిని రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ.. 13 మ్యాచులు ఆడి 108 పరుగులే చేశాడు. ఈ క్రమంలో ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో విధ్వంసకరంగా ఆడి.. మళ్లీ ఫ్రాంచైజీల కళ్లు తిప్పుకున్నాడు.

స్టీవ్ స్మిత్: గతేడాది అంతగా ఆడకపోవడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ స్టీవ్ స్మిత్‌ను వదిలేసి.. సంజు శాంసన్‌కు పగ్గాలు అప్పగించింది. ఇప్పటి వరకు 95 మ్యాచులు ఆడిన స్మిత్‌ 2,333 పరుగులు చేశాడు. 2020లో రూ.12.5 కోట్లు అందుకున్న స్మీత్ 14 మ్యాచులు ఆడిన స్మిత్‌ 311 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయి మళ్లీ ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.

డేవిడ్ మలన్‌: ప్రస్తుతం టీ20ల్లో నంబర్‌వన్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు డేవిడ్‌ మలన్‌. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా తనదైన ముద్ర వేసుకున్న మలన్‌పై ఫ్రాంచైజీలన్నీ దృష్టి సారించాయి. ఆల్‌రౌండర్‌ కావడంతో భారీ సొమ్ము చెల్లించేందుకు ప్రాంఛైజీలు చూస్తున్నట్లు సమాచారం.

ఆరోన్‌ ఫించ్‌: ఇప్పటివరకు ఎనిమిది ప్రాంఛైజీలు మారిన ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్.. ఈ మధ్య కాలంలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలో ఇటీవల పరుగుల వరద పారిస్తుండటంతో ప్రాంఛైజీలన్నీ ఫించ్‌పై కన్నేశాయి. గతేడాది బెంగళూరు తరపున ఆడిన ఫించ్.. 12 మ్యాచులు ఆడి 268 పరుగులే చేశాడు.

ముజీబుర్‌ రెహ్మాన్‌: అఫ్గాన్‌ తరఫున అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే అన్ని ఫార్మెట్‌లల్లో దూసుకుపోతున్నాడు ముజీబుర్‌ రెహ్మాన్‌. ఆల్‌రౌండర్ కావడంతో ఐపీఎల్‌లో క్రేజ్‌ ఉంది. గతేడాది పంజాబ్‌ తరుపున ఆడిన రెహ్మాన్‌కు జట్టులో అంతగా అవకాశం లభించలేదు. ప్రస్తుతం కీలక ప్రాంఛైజీలు దక్కించుకునేందుకు చూస్తున్నాయి.

Also Read:

IPL 2020 Auction: ఐపీఎల్ 2020 వేలంలోలో నిరాధరణకు గురైన ప్రముఖ క్రికెటర్లు వీరే..

Cricketer Died: క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు వదిలిన బ్యాట్స్‌మెన్.. పుణేలో హృదయ విదారక ఘటన..