IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం

తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఇండియా విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో ఛేజ్ కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం
India Vs New Zealand

Edited By:

Updated on: Jan 21, 2026 | 11:01 PM

తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో ఛేజ్ కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ 78 పరుగులు, టిమ్‌ రాబిన్‌సన్‌ 21 పరుగులు, మార్క్‌ చాప్‌మన్‌ 39 రన్స్, మిచెల్‌ 28 రన్స్, శాంట్నర్‌ 20 రన్స్‌ చేశారు. ఇక భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబె చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు.

నిర్ణీత 20 ఓవర్లు ఆడి ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ 7 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు సాధించింది. దీంతో 48 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది న్యూజిలాండ్‌. దీంతో 5 మ్యాచుల టీ20 సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియాలో లీడ్ లోకి వచ్చింది. అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 35 బంతుల‌లోనే 85 పరుగులతో రఫ్పాడించాడు. సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోయాడు అభిషేక్ శర్మ.