దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. కాగా ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు రాబోయే భారత్- వెస్టిండీస్ సిరీస్ పై కూడా పడింది. సఫారీ పర్యటన పూర్తయిన వెంటనే ఫిబ్రవరి 6 నుంచి విండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జైపూర్, విశాఖపట్నం, కటక్, తిరువనంతపురం, కోల్ కతా, అహ్మదాబాద్ లలో ఈ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు కేవలం రెండు నగరాలకే మ్యాచ్ లన్నీ జరగనున్నాయి. మూడు వన్డే మ్యాచ్ లు అహ్మదాబాద్ లో, టీ- 20 మ్యాచ్ లు కోల్ కతాలో జరగనున్నాయి.
బయో సెక్యూరిటీ ముప్పును తగ్గించేందుకు..
కరోనా వల్ల బయో సెక్యూరిటీ ముప్పు తగ్గించడంతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు, బ్రాడ్ కాస్టర్ల ప్రయాణాలను వీలైనంత తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా విండీస్ బోర్డు కూడా ఈ ప్రతిపాదనలను అంగీకరించింది. ఫిబ్రవరి 6- 20 ల మధ్య ఈ సిరీస్ జరగనుంది.
భారత్ -వెస్టిండీస్ సిరీస్ ఇలా..
ఫిబ్రవరి 6- మొదటి వన్డే – అహ్మదాబాద్
ఫిబ్రవరి 9- రెండో వన్డే- అహ్మదాబాద్
ఫిబ్రవరి 11- మూడో వన్డే- అహ్మదాబాద్
ఫిబ్రవరి 16- మొదటి టీ- 20- కోల్ కతా
ఫిబ్రవరి 18 – రెండో టీ-20- కోల్ కతా
ఫిబ్రవరి 20 – మూడో టీ- 20- కోల్ కతా
NEWS ? : BCCI announces revised venues for home series against West Indies.
The three ODIs will now be played at the Narendra Modi Stadium, Ahmedabad and three T20Is will be held at the Eden Gardens, Kolkata.
More details here – https://t.co/vH9SOhtpIS #INDvWI pic.twitter.com/KNEZ8swbVa
— BCCI (@BCCI) January 22, 2022
Health: ఆరోగ్యానికి మంచిదని వెల్లుల్లి తెగ తింటున్నారా.? ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు..