Ind vs Eng 1st Test: తుది జట్టులో కుల్దీప్‌కు నో ఎంట్రీ.. విరాట్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Kuldeep Yadav - India vs England : దాదాపు రెండేళ్ల నుంచి టెస్ట్ మ్యాచ్ ఆడలేదు.. అయినా కానీ అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.. అయినా టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌‌ను...

Ind vs Eng 1st Test: తుది జట్టులో కుల్దీప్‌కు నో ఎంట్రీ.. విరాట్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Updated on: Feb 05, 2021 | 12:58 PM

Kuldeep Yadav – India vs England : దాదాపు రెండేళ్ల నుంచి టెస్ట్ మ్యాచ్ ఆడలేదు.. అయినా కానీ అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.. అయినా టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌‌ను పక్కనబెడుతుండటంపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శుక్రవారం ఇండియా – ఇంగ్లాండ్‌ మద్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి టెస్టుకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను మరోసారి భారత తుది జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ టెస్ట్‌కు ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టర్ సుందర్‌ను తీసుకున్నారు. అక్షర్ పటేల్‌కు గాయం కావడంతో కెప్టెన్ కోహ్లీ తొలి టెస్ట్‌లో ఆయన స్థానంలో షాబాజ్ నదీమ్‌ను తుది జట్టులో తీసుకున్నాడు. అయితే కుల్దీప్‌ను తుది జట్టులో తీసుకోకపోవడంపై సోషల్ మీడియా ద్వారా మాజీ క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. రెండేళ్ల క్రితం కుల్దీప్ భారత జట్టులో ఎంపికై నిరీక్షిస్తున్నాడంటూ ట్విట్ చేశాడు.

చివరిసారిగా కుల్దీప్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాయి. కుల్దీప్ ఇప్పటివరకు ఆడిన ఆరు టెస్టుల్లో 24 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల చొప్పున తీశాడు.

Also Read: