India vs Australia 3rd T20I: సూర్యకుమార్‌ సిక్సులు.. విరాట్‌ విశ్వరూపం.. సిరీస్‌ భారత్‌ కైవసం..

|

Sep 26, 2022 | 12:14 AM

హైదరాబాద్ వేదికగా ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ వీరవిహారం, సూర్య కుమార్‌ సిక్సులతో విజయం సునాయసమైంది.

India vs Australia 3rd T20I: సూర్యకుమార్‌ సిక్సులు.. విరాట్‌ విశ్వరూపం.. సిరీస్‌ భారత్‌ కైవసం..
virat kohli suryakumar yadav
Follow us on

India vs Australia 3rd T20I Highlights: హైదరాబాద్ వేదికగా ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ వీరవిహారం, సూర్య కుమార్‌ సిక్సులతో విజయం సునాయసమైంది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు దింపింది. భారత్‌కు ఆస్ట్రేలియా 187 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54) ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బూమ్రా వేసిన చివరి ఓవర్‌ టీమిండియాకు భారీ టార్గెట్‌ను ఇచ్చింది. అయినప్పటికీ.. భారత్‌ బ్యాటర్లు నాలుగు వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగానే ( 19.5 ఓవర్లలో)  187 పరుగులు సాధించారు. సూర్యకుమార్ 69 పరుగులు సాధించగా.. విరాట్ కోహ్లీ 63, పాండ్యా 25 (నాటౌట్) పరుగులు సాధించారు. చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సిన తరుణంలో మొదటి బంతికి విరాట్ సిక్స్‌ కొట్టగా.. హార్దిక్‌ పాండ్య ఐదో బంతికి ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయంతోపాటు సిరీస్‌ను అందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా సూర్యకుమార్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా అక్షర్ పటేల్ నిలిచాడు.

లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొన్ని మంచి షాట్లు ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (17) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఈ క్రమంలో జతకలిసిన సూర్యకుమార్ యాదవ్, కోహ్లీ విజయం దిశగా తీసుకెళ్లారు. సూర్య అవుటైన తర్వాత ఆసీస్ బౌలర్లు, ఫీల్డర్లు కట్టడి చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఆసీస్ బౌలర్లలో డానియల్ శామ్స్ 2 వికెట్లు తీసుకోగా.. జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు.

ఆసీస్ బ్యాటర్లు కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, అతనికి డానియల్ శామ్స్ ధాటిగా ఆడి భారీ స్కోరు అందించారు. అయితే ఫించ్ (7), స్టీవ్ స్మిత్ (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (6) నిరాశ పరిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో చెలరేగగా.. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..