India Vs Australia 2020: ఐదో వికెట్ కోల్పోయిన ఆసిస్ జట్టు.. క్రీజులో కెప్టెన్ టిమ్, గ్రీన్…

| Edited By:

Dec 26, 2020 | 10:07 AM

38 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసిస్ జట్టును హెడ్, లబుషేన్ ఆదుకున్నారు. దాదాపు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో భారత బౌలర్ బుమ్రా క్రీజులో కుదురుకున్న హెడ్ (38)ను ఔట్ చేశాడు.

India Vs Australia 2020: ఐదో వికెట్ కోల్పోయిన ఆసిస్ జట్టు.. క్రీజులో కెప్టెన్ టిమ్, గ్రీన్...
Follow us on

భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే బుమ్రా ఆసిస్ ఓపెనర్‌ జో బర్న్స్ ఔట్ చేశాడు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లను తీశాడు..

 

కుదురుకున్న వాళ్లను కూల్చేశాడు…

38 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసిస్ జట్టును హెడ్, లబుషేన్ ఆదుకున్నారు. దాదాపు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో భారత బౌలర్ బుమ్రా క్రీజులో కుదురుకున్న హెడ్ (38)ను ఔట్ చేశాడు. దీంతో ఆసిస్ 124 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

మొదటి వికెట్….

అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సిరాజ్‌కు మొదటి వికెట్ లభించింది. ఆసిస్ బ్యాట్స్‌మెన్ లబుషేన్(48) అర్ధ శతకం వైపు దూసుకుపోతుండగా… సిరాజ్ మంచి డెలివరీతో ఔట్ చేశాడు. దీంతో ఆసిస్ 134 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.