India vs Afghanistan: అఫ్ఘాన్‌పై భారీ విజయం.. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్‌ ఆటగాళ్లు సత్తా చాటారు. తాజాగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు ఫైనల్‌కు ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని భారత్ 79 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి జయకేతనం ఎగురవేసింది

India vs Afghanistan: అఫ్ఘాన్‌పై భారీ విజయం.. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్
India Vs Afghanistan U19 Semifinal

Updated on: Nov 12, 2026 | 5:10 PM

అండర్ 19 ఆసియా కప్‌ ఫైనల్‌ భారత జట్టు ఎంపికైంది. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అఫ్ఘాన్ బ్యాటర్‌లలో నోమన్ సలార్జాయ్, షా ఫైసల్ రహీమీ చెరో ఆఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ సోహైల్ ఖాన్ 36 పరుగులతో రాణించాడు. ఇక భారత్ బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లు తీయగా, ఆర్యన్ సావసాని రెండు వికెట్లు తీశాడు. కావ్య పటేల్, యశ్‌బర్ధన్ చౌహాన్, అర్జున్ రాజ్‌పుత్ ఒక్కో వికెట్ తీశారు.

ఇక 228 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత.. స్టార్టింగ్ నుంచే అప్ఘాన్ బౌలర్లపై ఆధిపత్యాన్ని చలాయించింది. కెప్టెన్ లక్ష్య రాజేష్ 90 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేసి కెప్టెన్ ఇన్సింగ్ అడాడు.. మరో ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ సైతం 51 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన వికే వినీత్ 62 బంతుల్లో 57 పరుగులు చేయగా, యశ్‌బర్ధన్ చౌహాన్ 16 పరుగులు చేసయడంతో 36.5 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టానికి భారత్ 230 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఫైనల్ ఎప్పుడూ.. ఎవరితో

ఇక ఈ విజయంతో అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన  పాకిస్థాన్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 14వ తేదీన ఓమన్‌ అల్‌ అమీరన్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉదయం 10.30 గంటలకు జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us