
ఆగస్టు 15 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న హాకీ వరల్డ్ కప్ 2026 కోసం ఇండియన్ హాకీ ఫెడరేషన్ మంగళవారం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞుడైన డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వరల్డ్ కప్‌లో జట్టు పరిమాణంపై ఉన్న పరిమితి కారణంగా ఇటీవల ఎఫ్‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌లో ఆడిన నలుగురు ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం దక్కలేదు.
డిఫెండర్ అమన్‌దీప్ లక్రా, మిడ్‌ఫీల్డర్లు రాజ్ కుమార్ పాల్, రబిచంద్ర సింగ్ మొయిరాంగ్‌థెమ్, ఫార్వర్డ్ సెల్వం కార్తీ ఈసారి జట్టుకు దూరమయ్యారు. పూల్-డిలో ఉన్న భారత్ టోర్నీలో ఆగస్టు 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో, ఆగస్టు 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక పోరులో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు భారత జట్టు నాకౌట్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.
గత 2023 హాకీ ప్రపంచకప్‌లో భారత్ నిరాశపరిచి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే విజేతగా నిలిచింది. 1975లో పాకిస్థాన్‌ను ఓడించి తొలిసారి, ఇప్పటివరకు ఏకైక టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 1971లో కాంస్య పతకం, 1973లో రజత పతకం గెలిచింది. ఆ తర్వాత ప్రపంచకప్‌లో మరో పతకాన్ని సాధించలేకపోయింది.
Ready for the Biggest Stage. 🇮🇳🏑
Here’s the Indian Men’s Squad for the FIH Hockey World Cup Belgium & Netherlands 2026. 💙
Carrying the hopes of a nation, the squad is ready to challenge the world’s best and write a new chapter in Indian hockey. 🏆
Go well, Team India! 💪… pic.twitter.com/fdN6OWKVoE
— Hockey India (@TheHockeyIndia) July 21, 2026