Kohli – Dhoni: కోహ్లీ, ధోని కుమార్తెలపై అసభ్యకర వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్..

|

Jan 12, 2023 | 11:54 AM

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇటీవల ధోనీ, కోహ్లీ కుమార్తెలపై చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యల స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫైర్ అయ్యారు.

Kohli - Dhoni: కోహ్లీ, ధోని కుమార్తెలపై అసభ్యకర వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్..
Virat Kohli Ms Dhoni
Follow us on

భారతదేశంలోని క్రికెటర్లపై అభిమానుల హోప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు. లేదంటే నేలకు దించేస్తారు. ఇక ఇలాంటి సమయాల్లో వారి ఫ్యామిలీలు కూడా ఈ నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ, విచిత్రంగా ఈ మధ్య ధోనీ, కోహ్లీల విషయంలో చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇటీవల ధోనీ, కోహ్లీ కుమార్తెలపై చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యల స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేశారు. భారత మాజీ కెప్టెన్‌లు ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లి కుమార్తెలు వేధింపులకు గురిచేస్తున్నారని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ బుధవారం దృష్టికి తీసుకొచ్చారు. ఆమె తన సోషల్ మీడియాలో కొంతమంది అభిమానుల వేధింపుల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని పిలుపునిచ్చింది.

ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ నోటీసులు..

“ఒక 2 నుంచి 7 ఏళ్ల అమ్మాయిల గురించి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారా? మీరు ఒక ఆటగాడిని ఇష్టపడకపోతే, అతని కుమార్తెను దుర్భాషలాడతారా? ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని పోలీసులకు నోటీసు జారీ చేశాను” అని ఆమె ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

విరాట్, అనుష్కల కుమార్తె వామిక 2వ పుట్టినరోజు జనవరి 11న సెలబ్రేట్ చేసుకుంది. ఆమె జనవరి 11, 2023న జన్మించింది. విరాట్, అనుష్క ఆమె చిత్రాన్ని ప్రజలకు చూపించకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా, తల్లిదండ్రులు తమ కుమార్తెను కెమెరాల కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోవైపు, జీవా ఇప్పటికే ఇంటర్నెట్ సంచలనంగా నిలిచింది. ఆమె ఐపీఎల్ సమయంలో తల్లి సాక్షితో కలిసి సోషల్ మీడియాలో తన తండ్రిని ఉత్సాహపరుస్తున్న వీడియోలు ఎన్నో కనిపించాయి. ప్రపంచ కప్ తర్వాత జివా ఇటీవల లియోనెల్ మెస్సీ సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని ధరించింది. ఈ ఫొటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్ని సెకన్లలో వైరల్ అయ్యింది.

ఇలాంటి ఫొటోలపై కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌.. ఆ ట్వీట్‌ల స్క్రీన్ షాట్లను పంచుకుని, వారిపై ఫైర్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..