టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?

|

Feb 03, 2021 | 3:35 PM

అజేయ సెంచరీతో భారత్ జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఆ మ్యాచ్ అనంతరం ఈ ఢిల్లీ ఆటగాడి గురించి ఓ షాకింగ్ విషయం వెల్లడైంది. తన వయస్సును ఒక సంవత్సరం...

టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
Follow us on

Manjot Kalra Age Fraud: సరిగ్గా మూడేళ్ల క్రిందట అంటే 2018వ సంవత్సరం ఇదే రోజున.. టీమిండియా అండర్ 19 జట్టు నాలుగోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత్ జట్టు సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో పృథ్వీ షా నేతృత్వంలో టోర్నీ అంతటా టీమిండియా అజేయంగా నిలిచింది. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి.. పాకిస్థాన్‌ను సెమీఫైనల్స్‌లో మట్టికరిపించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక ఫైనల్స్‌లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు యువ బ్యాట్స్‌మెన్ మంజోట్ కల్రా. అజేయ సెంచరీతో భారత్ జట్టును ముందుండి నడిపించాడు.

అయితే ఆ మ్యాచ్ అనంతరం ఈ ఢిల్లీ ఆటగాడి గురించి ఓ షాకింగ్ విషయం వెల్లడైంది. తన వయస్సును ఒక సంవత్సరం తక్కువగా నమోదు చేయడం వల్ల అతడికి ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చిందని స్పష్టమైంది. 2019లో మంజోట్ తల్లిదండ్రులు.. మంజోట్ వయస్సును రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మంజోట్‌పై రంజీ ట్రోఫీ ఆడకుండా ఒక ఏడాది.. ఏజ్-గ్రూప్ క్రికెట్‌ను ఆడకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

2018 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ లక్ష్యం 217:

ఆస్ట్రేలియా విధించిన 217 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కెప్టెన్ పృథ్వీ షా (29), గిల్ (31), హార్విక్ దేశాయ్(47)లు చక్కటి ఇన్నింగ్స్ ఆడగా.. మంజోట్ కల్రా (101) సెంచరీతో కదంతొక్కాడు. మంజోట్ అండర్ 19 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

మంజోట్ కల్రా నిషేధం…

ప్రపంచకప్ తర్వాత మంజోట్ కల్రా తన వయస్సును తప్పుగా చూపించాడని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ విషయంపై బీసీసీఐ దర్యాప్తు చేయగా.. మంజోట్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఢిల్లీ పోలీసుల విచారణలో మాత్రం అసలు విషయం తేలింది. మంజోట్ తల్లిదండ్రులు తక్కువ వయస్సు నమోదు చేశారని.. తద్వారా మంజోట్‌కు ప్రపంచకప్ అదే అవకాశం వచ్చిందని స్పష్టమైంది. దీనితో బీసీసీఐ అతడిపై ఏడాది పాటు రంజీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. అలాగే అప్పుటి కోచ్‌ రాహుల్ ద్రావిడ్ ఇలాంటి వ్యవహారాల్లో కతినంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.

Also Read:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..

రోజుకో ట్విస్ట్ ఇస్తున్న మదనపల్లె మర్డర్ కేసు.. హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్‌లోనే.?