IPL Auction 2021: నేను ఇంకా ఆగలేను.. ముంబై ఇండియన్స్ టీమ్‌కి సెలెక్ట్ కావడంపై అర్జున్ టెండూల్కర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Arjun Tendulkar: ఐపీఎల్ 2021 వేలం పాటలో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ ..

IPL Auction 2021: నేను ఇంకా ఆగలేను.. ముంబై ఇండియన్స్ టీమ్‌కి సెలెక్ట్ కావడంపై అర్జున్ టెండూల్కర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Updated on: Feb 20, 2021 | 2:42 PM

Arjun Tendulkar: ఐపీఎల్ 2021 వేలం పాటలో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్ టీమ్‌పై అర్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఐపీఎల్ ప్రారంభం మొదలు.. ఎల్లప్పుడూ ముంబై ఇండియన్స్ వీరాభిమాని అని అర్జున్ చెప్పుకొచ్చాడు. తనను నమ్మి జట్టులోకి తీసుకున్న యాజమాన్యానికి, జట్టు కోచ్‌లు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. ముంబై ఇండియన్ జెర్సీని ధరించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, జెర్సీ ధరించకుండా ఉండలేనని అర్జున్ పేర్కొన్నాడు. ఆ మేరకు అర్జున్ వీడియో సందేశాన్ని పంపగా.. ముంబై ఇండియన్స్ యాజమాన్యం దాన్ని ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. ఐపీఎల్ 2021 ఆక్షన్‌లో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్ టీమ్ దక్కించుకుంది. లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, బ్యాట్స్‌మెన్ అని అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

Mumbai Indians Instagram:

Also read:

Advocates Murder: నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు.. వామన్‌రావు దంపతుల హత్యపై తొలిసారిగా స్పందించిన పుట్ట మధు

బంగారం ధరలు మరింత దిగువకు.. ఆరు నెలల్లో రూ. 10,000 తగ్గుదల.. కొనడానికి ఇది సరైన సమయమేనా.!