India Vs England 2021: ‘ఆ విషయం నేను చెప్పను’.. మీడియా ప్రతినిధులకు షాక్ ఇచ్చిన అజింక్యా రహానే..

|

Feb 12, 2021 | 7:04 PM

India Vs England 2021: ఇండియా తొలి టెస్టు ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్‌ ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉంది. ఈ క్రమంలోనే..

India Vs England 2021: ఆ విషయం నేను చెప్పను.. మీడియా ప్రతినిధులకు షాక్ ఇచ్చిన అజింక్యా రహానే..
Follow us on

India Vs England 2021: ఇండియా తొలి టెస్టు ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్‌ ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తోంది. మొదటి టెస్ట్‌లో విఫలమైన పలువురు ఆటగాళ్లను పక్కన పెట్టి, వేరే వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, తాజాగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానేను మీడియా ప్రతినిథులు పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా రెండో టెస్ట్‌లో ఆడే ఆటగాళ్ల పేర్లను కోరగా.. రహానే సమాధానం దాటవేశాడు. ‘రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఎవరు ఆడుతారు. ఎవరు ఆడరు. అనే విషయాలను ఇప్పుడే చెప్పను. ప్రతీ ప్లేయర్ బాగానే రాణిస్తున్నాడు. ముఖ్యంగా మా స్పిన్నర్లు బాగా ఆడటానికి ఆసక్తిగా ఉన్నారు.’ అని రహానే చెప్పుకొచ్చాడు.

ఇదిలాఉండగా.. కెప్టెన్సీ మార్పుపైనా మీడియా ప్రతినిథులు రహానేకి ప్రశ్నలు సంధించారు. దీనికి తనదైన శైలిలో సమాధానం చెప్పిన రహానే.. ‘మీరు ఏదో రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ.. నా వద్ద ఎలాంటి సమాచారం లేదు.’ అని స్పష్టం చేశారు. ఇకపోతే.. తొలి టెస్ట్ ఓటమిపై స్పందించిన రహానే.. ‘చెపాక్ స్టేడియం పూర్తి భిన్నంగా ఉంది. అందుకే కాస్త ఇబ్బంది పడ్డాం. తొలి టెస్ట్ మ్యాచ్ పరాజయాన్ని మేం మరిచిపోయాం. రేపటి మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణిస్తాం.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 227 పరుగుల తేడాతో ఘోర టీమిండియా ఓటమిని చవి చూసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72), గిల్(50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీనితో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యం సంపాదించింది.

Also read:

IPL-2021 Player Auction: ఐపీఎల్‌-2021 మినీ వేలం.. జాబితాలో అతిచిన్న, అతిపెద్ద వయస్కులు వీరే..!

IND vs ENG 2nd Test: నాలుగు మార్పులతో బరిలోకి ఇంగ్లాండ్.. 12 మంది జట్టు సభ్యులను ప్రకటించిన జో రూట్..