తమిళ హీరోతో డేటింగ్‌లో ఉన్నా..

|

Mar 17, 2020 | 8:53 AM

హైదరాబాద్ బ్యాడ్మింటన్‌కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన క్రేజీ స్టార్ గుత్తాజ్వాల. సామాజిక రాజకీయ అంశాలపై చురుకుగా స్పందిస్తూ వేడి పుట్టిస్తుంటుంది.తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్విట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది..

తమిళ హీరోతో డేటింగ్‌లో ఉన్నా..
Follow us on

హైదరాబాద్ బ్యాడ్మింటన్‌కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన క్రేజీ స్టార్ గుత్తాజ్వాల. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా రాణించి తనదైన ముద్ర వేసిన ఆమె గత కొంతకాలంగా వివాదాల్లోనూ ముందు వరుసలో ఉంటోంది. ప్రస్తుతం రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటోంది గుత్తాజ్వాల. సొంతంగా అకాడమీ పెట్టి దాని నిర్వహణలో శ్రమిస్తోంది. సామాజిక రాజకీయ అంశాలపై చురుకుగా స్పందిస్తూ వేడి పుట్టిస్తుంటుంది. ‘నా అకాడమీ కోసం ప్రభుత్వం ఏమీ సాయం చేయలేదని.. ఇల్లు అమ్మి అకాడమీ ప్రారంభించానని’ గుత్తాజ్వాల వెల్లడించింది. భారత్ కు పతకాలు అందించే వారిని తయారు చేస్తానని చెప్పింది.
బ్యాడ్మింట‌న్ గేమ్‌కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తీసుకొచ్చిన గుత్తా జ్వాల తాజాగా సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. తన ప్రేమ బంధం గురించి జ్వాల మనసు విప్పి చెప్పింది. తాను ఒక తమిళ హీరో తో డేటింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని తెలిపింది. వివాహం ఎప్పుడు చేసుకోవాలన్నది నిర్ణయించుకోలేదని.. త్వరలోనే ఒక్కటవుతామని.. అందర్నీ ఆహ్వానిస్తానని వెల్లడించింది.