మోకాళ్లపై కూర్చొని ఫ్లాయిడ్​ మృతికి క్రికెటర్ల సంఘీభావం..

|

Jul 08, 2020 | 11:54 PM

సౌథాంప్టన్​లో ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య జరుగుతున్న మొద‌టి టెస్టులో 'బ్లాక్​ లివ్స్​ మేటర్​​​' ఉద్యమానికి ఆట‌గాళ్లు మ‌ద్ద‌తు తెలిపారు.

మోకాళ్లపై కూర్చొని ఫ్లాయిడ్​ మృతికి క్రికెటర్ల సంఘీభావం..
Follow us on

సౌథాంప్టన్​లో ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య జరుగుతున్న మొద‌టి టెస్టులో ‘బ్లాక్​ లివ్స్​ మేటర్​​​’ ఉద్యమానికి ఆట‌గాళ్లు మ‌ద్ద‌తు తెలిపారు. జాతివివక్షకు వ్యతిరేకంగా ప్రపంచంలోని న‌లుమూల‌ల నుంచి జరుగుతున్న నిరసనలకు స‌పోర్ట్ తెలుపుతూ.. ఇరు టీమ్స్ ప్లేయ‌ర్స్ గ్రౌండ్ లో మోకాళ్లపై కూర్చొని కొంతసేపు మౌనం పాటించారు. ఇన్నింగ్స్​లో ఫ‌స్ట్ బాల్ వేయడానికి ముందు గ్రౌండ్ లో వెస్టిండీస్​ ప్లేయ‌ర్స్ తో పాటు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్లు, అవుట్​ఫీల్డ్​లో సిబ్బంది స‌హా మోకాల్ల‌పై కూర్చుని ఫ్లాయిడ్ నిరసనలకు మద్దతుగా నిలిచారు. మే నెలలో అమెరికాలోని నల్లజాతీయుడు జార్జ్​ ఫ్లాయిడ్​.. పోలీసుల క్రూర దాడిలో ప్రాణాలు విడిచాడు. ఆయన మరణం పట్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ్ర‌హ జ్వాల‌లు చెల‌రేగాయి.

ఇక వర్షం కారణంగా ఇంగ్లాండ్​, వెస్టిండీస్ ఫ‌స్ట్ మ్యాచ్​ కాస్త లేటుగా ప్రారంభమైంది. మొద‌ట‌ టాస్​ నెగ్గిన‌ ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. రెండో ఓవర్​లోనే ఇంగ్లీష్​ టీమ్ సిబ్లే రూపంలో ఫ‌స్ట్ వికెట్​ కోల్పోయింది.