England cricket fan : తన అభిమాన ఆటగాళ్లను చూడటానికి దేశం కానీ దేశంలో 10నెలలు వేచిచూసాడు.. చివరకు..

|

Jan 15, 2021 | 9:46 PM

క్రికెట్ అంటే మనదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం మంచి క్రేజ్ ఉంది. తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి ఎంతదూరమైనా వెళ్తుంటారు ఫ్యాన్స్.

England cricket fan : తన అభిమాన ఆటగాళ్లను చూడటానికి దేశం కానీ దేశంలో 10నెలలు వేచిచూసాడు.. చివరకు..
Follow us on

England cricket fan : క్రికెట్ అంటే మనదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మంచి క్రేజ్ ఉంది. తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి ఎంతదూరమైనా వెళ్తుంటారు ఫ్యాన్స్. తమ ఫెవరెట్ క్రికెటర్ ఆ రోజు మ్యాచ్ లో అద్భుతంగా ఆడడంటే చాలు అభిమానులకు ఆరోజు పండగే అంత క్రేజ్ ఉంది క్రికెట్ అంటే ప్రజల్లో.  తాజాగా ఓ క్రికెట్ ఫ్యాన్  తన అభిమాన క్రికెటర్లు ఆడటం చూడటానికి  దేశం కానీ దేశంలో ఏకంగా 10 నెలలు వేచి చూసాడు. కానీ చివరకు నిరాశే మిగిలింది. దానికి కారణం పోలీసులు. అసలేం జరిగిందంటే..

ఇంగ్లాండ్ -శ్రీలంక మధ్య  టెస్ట్ సిరీస్ జరుగుతుంది. తన అభిమాన ఆటగాళ్లను చూడటానికి ఇంగ్లాండ్ కు చెందిన రాబ్ లూయిస్ దాదాపు 10 నెలలుగా శ్రీలంకలో ఉన్నాడు. అయితే 2020మార్చ్ లో రాబ్ లూయిస్  శ్రీలంకలో జరిగే మ్యాచ్ కోసం అక్కడకు చేరుకున్నాడు. అదే టైంలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. దాంతో మ్యాచ్ వాయిదా పడింది. అలాగే ఆ దేశంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. దాంతో అతడు అక్కడే ఉండిపోయాడు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. చివరకు తన ఆశ నెరవేరే రోజు వచ్చింది. కరోనా వ్యాప్తి తగ్గడంతో తిరిగి ఇంగ్లాండ్ శ్రీలంక మధ్య మ్యాచ్ తిరిగి ప్రారంభంమైంది. మ్యాచ్ చూడటానికి అభిమానులకు అనుమతి లేక పోవడంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతిలేదంటూ అతడిని బయటకు నెట్టివేశారు. దాంతో తీవ్ర నిరాశకు గురైన రాబ్ లూయిస్. తనకు మ్యాచ్ చూడటానికి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను వేడుకుంటున్నాడు. దాదాపు 10 నెలలు దేశం కానీ దేశంలో ఉన్నాను.. కనికరించి తనను మ్యాచ్ వీక్షించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు రాబ్ లూయిస్.