AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: టీమిండియా స్టార్ బ్యాటర్‌తో చెవులు పట్టుకుని గుంజీలు తీయించిన యువరాజ్

Watch: అభిషేక్ శర్మ పుట్టినరోజు సందర్భంగా యువరాజ్ సింగ్ గుంజీలు తీయించిన వినోదాత్మక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మైదానంలో ఎంతటి భయానక బ్యాటర్ అయినప్పటికీ, మెంటార్ యువరాజ్ సింగ్ ముందు మాత్రం అభిషేక్ శర్మ క్రమశిక్షణ కలిగిన శిష్యుడిగా నిలవడం విశేషం. 

Watch: టీమిండియా స్టార్ బ్యాటర్‌తో చెవులు పట్టుకుని గుంజీలు తీయించిన యువరాజ్
Yuvraj Singh
Rakesh
|

Updated on: Sep 04, 2026 | 5:38 PM

Share

Watch: టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ 26వ పుట్టినరోజు సందర్భంగా అతని మెంటార్, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ షేర్ చేసిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు నెట్టింట దుమ్మురేపుతోంది. గ్రౌండ్‌లో చేసిన తప్పులకు గాను అభిషేక్ శర్మతో యువీ చెవులు పట్టుకుని గుంజీలు తీయించిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీ20 క్రికెట్‌లో తనదైన శైలితో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న అభిషేక్ శర్మ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో యువరాజ్ సింగ్ పాత్ర అత్యంత కీలకమైనది. పంజాబ్‌కు చెందిన ఈ యంగ్ క్రికెటర్‌కు యువీ చిన్నతనం నుంచి మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. అభిషేక్ శర్మ 26వ ఏట అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో అభిషేక్ శర్మ చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ కనిపిస్తున్నాడు.

తొలి బంతికే వికెట్ పారేసుకోవద్దు

అభిషేక్ శర్మ గ్రౌండ్‌లోకి వెళ్లగానే తొలి బంతి నుంచి బాదేయాలనే తొందరపాటులో తరచూ వికెట్ పారేసుకుంటుంటాడు. ఈ అలవాటును మాన్పించేందుకు యువరాజ్ సింగ్ అతడితో ప్రామిస్ చేయిస్తూ గుంజీలు తీయించాడు. “నేను మొదటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించను. తొలి బంతిని గాలిలోకి కొట్టను. క్రీజులో కాసేపు సమయం తీసుకుని బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తాను” అని అభిషేక్ శర్మతో యువీ చెప్పిస్తూ శిక్ష విధించాడు. ఈ గురుశిష్యుల సరదా వీడియో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

అభిషేక్ శర్మ అద్భుత రికార్డుల పరంపర

అభిషేక్ శర్మ కేవలం 26 ఏళ్ల వయసులోనే టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 లీగ్‌లలో 187.24 అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 931 రేటింగ్ పాయింట్లు సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆసియా కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడమే కాకుండా, టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 135 పరుగులు చేసిన ఘనత సాధించాడు.

భారత్ తరఫున మెరుపు రికార్డులు

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా వచ్చి బౌలింగ్‌లో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన అరుదైన ఆల్‌రౌండ్ రికార్డు కూడా అభిషేక్ సొంతం. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన రెండో అర్ధశతకాన్ని కేవలం 14 బంతుల్లోనే బాదాడు. అతి తక్కువ బంతుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన రికార్డుతో పాటు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ఘనత కూడా ఈ పంజాబ్ హిట్టర్ సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్టార్ బ్యాటర్‌తో చెవులు పట్టుకుని గుంజీలు తీయించిన యువరాజ్
స్టార్ బ్యాటర్‌తో చెవులు పట్టుకుని గుంజీలు తీయించిన యువరాజ్
అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అరటిపండు గురించి ఈ నిజాలు..
అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అరటిపండు గురించి ఈ నిజాలు..
గాడిద పాలు పిల్లలతో తాగించవచ్చా..?
గాడిద పాలు పిల్లలతో తాగించవచ్చా..?
విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం..
విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం..
రోహిత్ శర్మ రేర్ క్లబ్‌లో చేరిన స్మృతి మంధాన
రోహిత్ శర్మ రేర్ క్లబ్‌లో చేరిన స్మృతి మంధాన
టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై
టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై
ఒంటి కాలితో గెంతుతూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన!
ఒంటి కాలితో గెంతుతూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన!
మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..?
మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..?
అడవిలో పులి గురించి అన్ని జీవుల్ని అలెర్ట్ చేసే జీవి ఏదో తెలుసా..
అడవిలో పులి గురించి అన్ని జీవుల్ని అలెర్ట్ చేసే జీవి ఏదో తెలుసా..
హిందీ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేసుకుంటూ మన హీరోని అంటాడా.?
హిందీ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేసుకుంటూ మన హీరోని అంటాడా.?