రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో పర్యాటక జట్టు 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.1 ఓవర్లలో సునాయస విజయం సాధించింది. రోహిత్ శర్మ (51; 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (40; 53 బంతుల్లో 6 ఫోర్లు) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా భారత జట్టు ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మను గట్టిగా హగ్ చేసుకున్నాడు. బాలుడి సడెన్ ఎంట్రీతో హిట్‌మ్యాన్ కూడా కొద్దిసేపు అయోమయంలో పడ్డాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది బాలుడిని రోహిత్ నుంచి వేరు చేశారు. ఇక్కడే మరోసారి అందరి మనసులు గెల్చుకున్నాడు కెప్టెన్ రోహిత్. బాలుడిని ఏమీ అనవద్దని సెక్యూరిటీకి సూచించడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. టిక్నర్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన అభిమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించిన హిట్‌మ్యాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ రోహిత్.. మా మనసులు గెల్చుకున్నావయ్యా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకుని మైదానంలోకి వచ్చాడు. కోహ్లీని హత్తుకున్నాడు. అదే సమయంలో సూర్యకుమార్ ఇద్దరిని కలిపి ఫొటోలు తీయడం వైరల్‌గా మారింది. ఇవి చూడడానికి బాగానే ఉన్నా క్రికెటర్ల భద్రత విషయంలో సెక్యూరిటీ సిబ్బంది డొల్లతనం కనిపిస్తుందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Rohit is an emotion for all of us fans??#RohitSharma pic.twitter.com/aGgPBlIQ3K
— Ankit Sharma (@AnkitSharma8878) January 21, 2023
Craze for #RohitSharma in Raipur, A Young Fan Hugged Rohit Sharma?#INDvNZ #INDvsNZ #IndvsNZ2ndODI #INDvsNZ #TeamIndia pic.twitter.com/fDuPBR34PP
— Fantasy Win Prediction (@realfwp) January 21, 2023
Rohit Sharma told the security – “let him go, he’s a kid”.
Great gesture by the captain! pic.twitter.com/7Gz6nDHsV3
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం.. క్లిక్ చేయండి