Rohit Sharma Injury: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్.. ఫైనల్‌లో ఆడేనా?

India vs Australia: జూన్ 7 బుధవారం నుంచి లండన్‌లోని ఓవల్‌లో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. టీమ్ ఇండియా ఇప్పటికే చాలా మంది కీలక ఆటగాళ్లు లేకుండానే ఫైనల్‌లోకి ప్రవేశిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ గాయం టెన్షన్‌ని పెంచుతోంది.

Rohit Sharma Injury: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్.. ఫైనల్‌లో ఆడేనా?
Rohit Sharma

Updated on: Jun 06, 2023 | 4:47 PM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 24 గంటల కంటే తక్కువ సమయం ఉంది. అయితే లండన్ నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇది టీమిండియా అభిమానులను కలవరపెడుతుంది. మ్యాచ్‌కు ఒకరోజు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. మంగళవారం ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ బొటనవేలికి గాయమైంది. దీంతో నెట్స్ సెషన్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి గాయం ఎంత తీవ్రంగా ఉందో, బుధవారం పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది క్లారిటీ లేదు.

జూన్ 7 బుధవారం నుంచి ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అంటే ఒక రోజు ముందు టీమ్ ఇండియా మంగళవారం ఫైనల్ ప్రాక్టీస్ సెషన్‌ పూర్తి చేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బంతి అతని ఎడమ బొటన వేలికి తాకింది. దీంతో రోహిత్ శర్మ జట్టు ఫిజియో సహాయం తీసుకోవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, జట్టు ఫిజియో వెంటనే రోహిత్ బొటనవేలుకు టేప్ వేశాడంట. ఆ తర్వాత రోహిత్ కాసేపు పక్కన కూర్చున్నాడు. కాసేపటి తర్వాత అతను తిరిగి వచ్చాడు. మళ్లీ గ్లోవ్స్ ధరించి నెట్స్‌పై బ్యాటింగ్ చేయాలనుకున్నాడు. కానీ, ముందుజాగ్రత్తగా అలా చేయలేదు. గాయం తీవ్రంగా మారుతుందని, ప్రాక్టీస్‌ చేయలేదు.

అయితే, కెప్టెన్ గాయం తీవ్రమైనది కాదని, అతను బాగానే ఉన్నాడని స్వతంత్ర జర్నలిస్ట్ విమల్ కుమార్ పేర్కొన్నారు. ఇది టీమ్ ఇండియాకు ఊరటనిచ్చిందనుకోవాలి.

ఏది ఏమైనప్పటికీ, ఫైనల్‌కు ఒక రోజు ముందు, కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్‌ గాయం జట్టును కొంత ఆందోళనకు గురి చేసింది. అలాగే బుధవారం టాస్‌కు రోహిత్ బయటకు రానంత వరకు అతను ఫిట్‌గా ఉన్నాడా లేదా అనే భయం అభిమానుల్లో కొనసాగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..