
WPL 2026 : మహిళల క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. మూడు సీజన్లలో అభిమానులను స్టేడియంలకు రప్పించిన ఈ మెగా టోర్నమెంట్ నాలుగో ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచే ప్రారంభం కానుంది. ఈసారి ఐదు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించగా, టోర్నమెంట్ తేదీలు, వేదికలపై నిర్వాహకులు కసరత్తు పూర్తి చేశారు. WPL నాలుగో సీజన్ జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో పురుషుల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుండడంతో, WPL షెడ్యూల్‌ను ఒక నెల ముందుకు జరిపారు. ఈసారి WPL మ్యాచ్‌లు మూడో సీజన్ మాదిరిగా కాకుండా, రెండు నగరాల్లో నిర్వహించే అవకాశం ఉంది. రెండు దశల్లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ముంబై, బరోడా వేదికలుగా ఎంపికయ్యాయి. మొదటి దశ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి.రెండో దశ బరోడాలోని కోటంబి గ్రౌండ్‌లో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 3 ఫైనల్ వరకు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అయితే టోర్నమెంట్ ప్రారంభ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
WPL నాలుగో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు మొత్తం రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్లాబ్స్ ప్రకారం.. ఒక క్రికెటర్‌కు గరిష్టంగా రూ.3.5 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడిన టీమిండియా సభ్యురాలు స్మృతి మంధానను ఆర్‌సీబీ రికార్డు ధర రూ.3.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి శర్మను యూపీ వారియర్స్ విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒక ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే, వారి పర్స్ నుంచి రూ.9.75 కోట్లు తీసివేస్తారు. నలుగురిని రిటైన్ చేస్తే రూ.8.75 కోట్లు, ముగ్గురిని రిటైన్ చేస్తే రూ.7.75 కోట్లు, ఇద్దరిని రిటైన్ చేస్తే రూ.6 కోట్లు కట్ అవుతుంది.
వేలానికి ముందు వివిధ జట్ల పర్స్‌లో మిగిలిన డబ్బు వివరాల్లోకి వెళితే.. ఈసారి వేలంలో ఎక్కువ డబ్బుతో బరిలోకి దిగుతున్న జట్టు యూపీ వారియర్స్. ఈ జట్టు కేవలం శ్వేత షెరావత్‌ను (రూ.50 లక్షలు) మాత్రమే రిటైన్ చేసుకుంది. అందుకే వారి పర్స్‌లో అత్యధికంగా రూ.14.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం యూపీ వారియర్స్‌కు ఎక్కువగా ఉంది.
🔟 Days to Go ⏳
The countdown to #TATAWPL Mega Auction has begun 🔥
Catch the #TATAWPLAuction 2026 on November 27 on https://t.co/jP2vYAWukG pic.twitter.com/tQftgx5Zsn
— Women's Premier League (WPL) (@wplt20) November 17, 2025
రెండో స్థానంలో గుజరాత్ జెయింట్స్ నిలిచింది. వారు బెత్ మూనీ (రూ.3.5 కోట్లు), యాష్ గార్డ్‌నర్ (రూ.2.5 కోట్లు) వంటి ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకొని, తమ పర్స్‌లో రూ.9 కోట్లు మిగుల్చుకున్నారు. ఇది కూడా వేలంలో మంచి ఆటగాళ్ల కోసం పోటీ పడటానికి సరిపోతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చాలా మంది కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, మెరైన్ కాప్, అన్నబెల్ సదర్లాండ్ వంటి నలుగురు స్టార్ ఆటగాళ్లను చెరో రూ.2.2 కోట్లకు, అలాగే నిక్కీ ప్రసాద్‌ను రూ.50 లక్షలకు రిటైన్ చేసుకున్నారు. ఈ రిటెన్షన్ తర్వాత ఢిల్లీ పర్స్‌లో రూ.6.75 కోట్లు మిగిలి ఉన్నాయి.
మరోవైపు ఆర్‌సీబీ జట్టు స్మృతి మంధాన (రూ.3.5 కోట్లు)తో సహా, రిచా ఘోష్ (రూ.2.75 కోట్లు), ఎలిస్సా పెర్రీ (రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్‌ను (రూ.60 లక్షలు) రిటైన్ చేసుకుంది. ఆర్‌సీబీ పర్స్‌లో రూ.6.15 కోట్లు మిగిలాయి. ఇక, అన్ని జట్ల కంటే తక్కువ డబ్బుతో వేలంలోకి దిగుతున్న జట్టు ముంబై ఇండియన్స్. ఈ జట్టు నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మ్యాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, జి. కమలినితో సహా మొత్తం ఐదుగురు ముఖ్య ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. దీంతో వారి పర్స్‌లో కేవలం రూ.5.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..