
వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని సూపర్ స్టార్లకు మహిళల ప్రీమియర్ లీగ్ ట్వంటీ20 (WPL)లో అధిక డిమాండ్ ఉంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్ – 2.5 కోట్లు), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 3.5 కోట్లు), రిచా ఘోష్ (బెంగళూరు – 2.75 కోట్లు), జెమిమా రోడ్రిగ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్ – 2.2 కోట్లు), షఫాలి వర్మ (ఢిల్లీ – 2.2 కోట్లు)లను ఆయా ఫ్రాంచైజీలు అంటిపెట్టుకున్నాయి.
27న ఢిల్లీలో జరగనున్న WPL వేలానికి ముందు జట్లు నిలుపుకునే ఆటగాళ్ల జాబితా, వారి పారితోషికాన్ని ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.
వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వర్టన్ (గుజరాత్ జెయింట్స్), ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ (యూపీ వారియర్స్)లను జట్లు నిలుపుకోలేదు. స్మృతి మంధాన, నాట్సివర్ బ్రెంట్ (ముంబై), ఆష్లే గార్డ్నర్ (గుజరాత్) అత్యధిక పారితోషికం రూ.3.5 కోట్లు అందుకున్నారు.
WPL ఫ్రాంచైజీలు వేలానికి విడుదల చేయకుండానే ఒక దేశీయ ఆటగాడితో సహా గరిష్టంగా 5గురు ఆటగాళ్లను నిలుపుకోవడానికి అనుమతి ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..