
WPL 2024, DCW vs UPW: నేడు, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 15వ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ (UPW) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DCW)జట్ల మధ్య జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. DCW WPL 2024లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యూపీ వారియర్స్ 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. నిన్ననే ముంబై ఇండియన్స్ చేతిలో యూపీ వారియర్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. యూపీ ప్లేయింగ్ 11లో 2 మార్పులు, ఢిల్లీ జట్టులో 1 మార్పు చోటు చేసుకుంది.
యూపీ వారియర్స్: అలిస్సా హీలీ (వికెట్‌కీపర్/కెప్టెన్), కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, ఉమా ఛెత్రి, గౌహర్ సుల్తానా, గౌహర్ సుల్తానా.
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, ఎలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, తానియా భాటియా (వికెట్), శిఖా పాండే, టిటాస్ సాధు.
2⃣ Changes for UP Warriorz
1⃣ Change for Delhi CapitalsHere are the Playing XIs of the two teams 🤝
Live 💻📱https://t.co/HW6TQgqctC#TATAWPL | #DCvUPW pic.twitter.com/V8XUTH4Evh
— Women’s Premier League (WPL) (@wplt20) March 8, 2024
యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరులో ఢిల్లీదే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా, ప్రతిసారీ ఢిల్లీ క్యాపిటల్స్ (DCW) విజయం సాధించింది. WPL 2024 నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో UP వారియర్స్‌పై విజయం సాధించింది. దీంతో పాటు గత సీజన్‌లో 5వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగుల తేడాతో యూపీడబ్ల్యూపై, 20వ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..