చారిత్రాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభమైంది. తొలి మ్యాచ్ నుంచే ఉత్కంఠ మ్యాచ్‌లు అభిమానులను అలరిస్తున్నాయి. కేవలం ఐదు జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి రెండు రోజుల్లో 3 మ్యాచ్‌లు ముగియగా, అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. మొదటి డబుల్ హెడర్ మార్చి 5 ఆదివారం జరిగింది. దాని ముగింపుతో, పాయింట్ల పట్టికలో స్థానం మొదటిసారిగా స్పష్టమైంది. డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లోనే భారీ విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ రెండు వరుస ఓటములతో అట్టడుగున నిలిచింది.
WPL మొదటి సీజన్ శనివారం, మార్చి 4 ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఘనమైన ఆరంభం చేసింది. ఆ తర్వాత ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 60 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. ఆ తరువాత, తదుపరి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య జరిగింది. ఇందులో యూపీ గుజరాత్‌ను 3 వికెట్ల తేడాతో ఉత్కంఠభరితంగా ఓడించింది.
తొలి రౌండ్ మ్యాచ్‌లు ముగిశాక పాయింట్ల పట్టికలో కూడా పరిస్థితి స్పష్టమైంది. ముంబై, ఢిల్లీ, యూపీ తమ తొలి మ్యాచ్‌ల్లో గెలిచి తలో 2 పాయింట్లు సాధించాయి. అయినప్పటికీ, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో నిలిచింది. నెట్ రన్‌రేట్ (NRR)లో భారీ వ్యత్యాసం కారణంగా ఇది జరిగింది. గుజరాత్‌పై 143 పరుగుల విజయంతో, ముంబై NRR (+) 7.150గా నిలిచింది. ఇది మొత్తం ఐదు జట్లలో అత్యధికంగా ఉంది.
రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (+) 3,000 రన్ రేట్‌తో ఉండగా, యూపీ వారియర్స్ (+) 0.374తో మూడో స్థానంలో ఉంది.
ఆర్‌సీబీ, గుజరాత్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరు ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే గుజరాత్ జెయింట్స్ తమ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి (-) 3.765 NRRని కలిగి ఉంది. ఇది అన్ని జట్లలో చెత్తగా మారింది. ఇక నేడు సోమవారం, ముంబై వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. దీనిలో బెంగళూరు ఖాతా తెరిచే అవకాశం ఉంది. అయితే ముంబై మొదటి స్థానంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..