ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022) జట్లు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తాయి. ఎందుకంటే T20 క్రికెట్‌లో చివరి ఐదు ఓవర్లలో ఆట స్వరూపమే మారుతుంది. అందుకే ప్రతి ఫ్రాంచైజీ తమతో అత్యుత్తమ డెత్ ఓవర్(Death Overs) బౌలర్‌ను కోరుకుంటుంది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పరిగణించబడుతున్న క్రిస్ జోర్డాన్(Chris Jordan)ను చెన్నై సూపర్ కింగ్స్(CSK) కూడా అదే ఆలోచనతో కొనుగోలు చేసింది. అయితే అతను గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్ పేలవంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌తో ఓడిపోవాల్సి వచ్చింది. డెత్ ఓవర్లలో చెత్త బౌలింగ్ చేసిన నలుగురు బౌలర్లు ఉన్నారు. వారు ఎవరో చూద్దాం..
ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ డెత్ ఓవర్లలో అత్యంత చెత్త ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. IPL 2020 నుంచి ఈ సీజన్ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే పాట్ కమిన్స్ డెత్ ఓవర్లలో ఓవర్‌కు 12.28 పరుగులు ఇచ్చాడు. పాట్ కమిన్స్ 2020 సంవత్సరంలో రూ. 15.50 కోట్లకు అమ్ముడుపోయాడు. అతని జీతం 2021లో కూడా అదే విధంగా ఉంది. అయితే ఈ ఏడాది కమిన్స్‌కు రూ.7.25 కోట్లకే అమ్ముడుపోయాడు. డెత్ ఓవర్లలో చెత్త ఎకానమీ రేటు పరంగా క్రిస్ జోర్డాన్ రెండో స్థానంలో ఉన్నాడు. క్రిస్ జోర్డాన్ ఎకానమీ రేటు ఓవర్‌కు 11.91 పరుగులుగా ఉంది. ఈ సీజన్‌లో క్రిస్ జోర్డాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 3.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. RCB కూడా ఈ ఆటగాడిని 2 కోట్లకు కొనుగోలు చేయడానికి బిడ్ చేసింది, కానీ చివరికి చెన్నై దక్కించుకుంది.
IPL 2022 వేలంలో రూ.10 కోట్లకు అమ్ముడుపోయిన భారత యువ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ డెత్ ఓవర్లలో పేలవమైన ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. కృష్ణ ఓవర్‌కు 11.40 పరుగులు ఇచ్చాడు. అయితే, ఈసారి అతని ప్రదర్శన బాగుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మ్యాచ్ విన్నర్ అయిన ఆండ్రీ రస్సెల్ కూడా డెత్ ఓవర్‌లో చాలా పరుగులు ఇచ్చాడు. రస్సెల్ ఎకానమీ రేటు ఓవర్‌కు 11.38 పరుగులుగా ఉంది.
Read also.. Corona In IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వణికిస్తున్న కరోనా.. తాజాగా మరొకరికి కరోనా పాజిటివ్..