
Australia vs South Africa, Quinton de Kock Century: గురువారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2023 ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ 10వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 84 బంతుల్లోనే సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో వరుస సెంచరీలతో వన్డే ప్రపంచకప్‌లో దూసుకపోతున్నాడు.
ఈ క్రమంలో డికాక్ తన 19వ వన్డే సెంచరీతో, 30 ఏళ్ల పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా, శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే అత్యధిక వన్డే సెంచరీల సంఖ్యను సమం చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నిర్వహించిన 2015 ప్రపంచకప్‌లో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌లపై వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు.
డి కాక్ గతంలో 2013లో భారత్‌పై బ్యాక్‌టు-బ్యాక్ వన్డే సెంచరీలు కొట్టాడు. ఈ క్రమంలో అతను హ్యాట్రిక్ సెంచరీలను పూర్తి చేశాడు.
5- కుమార్ సంగక్కర
2- AB డివిలియర్స్
2 – బ్రెండన్ టేలర్
2 – క్వింటన్ డి కాక్*
101 – హెర్షెల్ గిబ్స్, లీడ్స్, 1999
100 – ఫాఫ్ డు ప్లెసిస్, మాంచెస్టర్, 2019
100* – క్వింటన్ డి కాక్, లక్నో, 2023*
27- హషీమ్ ఆమ్లా
19 – క్వింటన్ డి కాక్*
18 – హెర్షెల్ గిబ్స్
13 – గ్యారీ కిర్స్టన్
10 – గ్రేమ్ స్మిత్
ఏబీ డివిలియర్స్
2- హషీమ్ ఆమ్లా
2- ఫాఫ్ డు ప్లెసిస్
2 – హెర్షెల్ గిబ్స్
2 – క్వింటన్ డి కాక్*
5 – ఫాఫ్ డు ప్లెసిస్
3 – హెర్షెల్ గిబ్స్
3 – క్వింటన్ డి కాక్*
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగి న్గిడి, కగిసో రబాడ, తబ్రైజ్ షమ్సీ.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..