World Cup 2023: వరల్డ్ కప్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న కోహ్లీ శత్రువు.. రిటైర్మెంట్‌పై యూ టర్న్..

World Cup 2023, Ben Stoke: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ఇప్పుడు ప్రపంచ కప్‌లో ఆడటానికి సిద్ధంగా ఉండవచ్చని తెలుస్తోంది. జనవరి 25 నుంచి భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమై మార్చి 11 వరకు కొనసాగనుంది. దీంతో CSKతో రూ.16 కోట్ల వార్షిక IPL కాంట్రాక్ట్‌ను స్టోక్స్ రద్దు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

World Cup 2023: వరల్డ్ కప్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న కోహ్లీ శత్రువు.. రిటైర్మెంట్‌పై యూ టర్న్..
World Cup 2023

Updated on: Aug 15, 2023 | 11:39 AM

World Cup 2023: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకుని, భారతదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో ఆడలేకపోయిన విరాట్ కోహ్లికి అతిపెద్ద శత్రువైన బెన్ స్టోక్స్.. క్రికెట్ మైదానంలో తన రిటైర్మెంట్ నుంచి ‘యూ-టర్న్’ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

కోహ్లికి అతి పెద్ద శత్రువు ప్రపంచకప్‌లో ఎంట్రీకి రెడీ..

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ఇప్పుడు ప్రపంచ కప్‌లో ఆడటానికి సిద్ధంగా ఉండవచ్చని తెలుస్తోంది. జనవరి 25 నుంచి భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమై మార్చి 11 వరకు కొనసాగనుంది. దీంతో CSKతో రూ.16 కోట్ల వార్షిక IPL కాంట్రాక్ట్‌ను స్టోక్స్ రద్దు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఒకవేళ స్టోక్స్ ఐపీఎల్‌లో మే నెలాఖరు వరకు రెండు నెలలు ఆడితే, అతను దాదాపు ఐదు నెలలు భారతదేశంలో గడపడం అతనికి సాధ్యం కాదు. అతను మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాలని భావిస్తున్నాడు. దీని కోసం IPL విండో ఉత్తమ సమయం అని అనిపిస్తుంది.

ఎందుకంటే ఇది అతను పోటీ క్రికెట్‌కు తిరిగి రావడానికి, రాబోయే సంవత్సరాల్లో ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహించడానికి అనుమతిస్తుంది.

ఇంగ్లండ్ ప్రపంచ కప్ హీరో..

2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై బెన్ స్టోక్స్ అజేయంగా 84 పరుగులు చేశాడు. దీని ద్వారా మ్యాచ్ టై చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీల పరంగా ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

చివరి ODI..

బెన్ స్టోక్స్ చివరిసారిగా 2022లో వన్డేల్లో కనిపించాడు. దక్షిణాఫ్రికాతో జులై 19న వన్డే క్రికెట్‌కు స్టోక్స్ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు అతను 1 సంవత్సరం విరామం తర్వాత ODI క్రికెట్‌లోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా వన్డే ప్రపంచకప్‌కే ప్రత్యేకం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..